భారత్ vs దక్షిణాఫ్రికా మొదటి వన్డే ఎప్పుడు? ఎక్కడ? ఎలా ఫ్రీగా చూడాలి? పూర్తి వివరాలు

Published : Nov 29, 2025, 04:34 PM ISTUpdated : Nov 29, 2025, 04:45 PM IST

India vs South Africa : భారత్, దక్షిణాఫ్రికా మొదటి వన్డే నవంబర్ 30న రాంచీలో ప్రారంభం. టెస్టు సిరీస్ ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. మరోసారి రోహిత్, విరాట్ కోహ్లీలను గ్రౌండ్ లో చూడటానికి అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు.

PREV
15
రాంచి లో భారత్, సౌతాఫ్రికా వన్డే సిరీస్ ప్రారంభం

భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ నవంబర్ 30 నుంచి ప్రారంభం కానుంది. రాంచీలోని JSCA ఇంటర్నేషనల్ స్టేడియంలో మొదటి వన్డే జరుగుతుంది. ఇటీవల జరిగిన 2–0 టెస్ట్ సిరీస్‌లో ప్రోటీస్ చేతిలో ఓటమి చెందిన భారత జట్టు ఈ సిరీస్‌లో పునరాగమనం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 

అయితే కీలక ఆటగాళ్లు దూరమవ్వడంతో ఈ వన్డేలు గెలుచుకోవడం భారత్ కు అంత సులభం కాదని క్రికెట్ నిపుణులు పేర్కొంటున్నారు. సిరీస్‌కు ముందు భారత జట్టులో ముఖ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. 

కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మెడ గాయం కారణంగా అందుబాటులో లేడు. వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా ఈ సిరీస్‌కు దూరమయ్యారు. కేఎల్ రాహుల్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.

25
భారత నాయకత్వం, బ్యాటింగ్ కాంబినేషన్‌పై దృష్టి

కేఎల్ రాహుల్ ఇప్పటివరకు 12 వన్డేలలో భారత్‌కు కెప్టెన్సీ చేసి 8 విజయాలు సాధించాడు. అయితే ఇటీవల టెస్ట్ సిరీస్‌లో అతని ఫామ్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఈ సిరీస్‌లో అతని ప్రదర్శనపై దృష్టి ఉంటుంది. ఐపీఎల్ లో నాయకత్వ బాధ్యతలు తీసుకోవడం ఇష్టంలేదని రాహుల్ ముందే చెప్పిన విషయం తెలిసిందే. 2023లో అతను అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా దక్షిణాఫ్రికాపై కెప్టెన్సీ చేశాడు.

ఓపెనింగ్‌లో రోహిత్ శర్మకు యశశ్వి జైస్వాల్ జతకానున్నారు. మూడో స్థానంలో విరాట్ కోహ్లీ ఆడనున్నారు. నాలుగో స్థానంపై ఇప్పటికీ ప్రశ్నలు ఉన్నాయి. ఆ స్థానంలో రిషభ్ పంత్ లేదా తిలక్ వర్మ ఆడే అవకాశాలు ఉన్నాయి.

బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వడంతో ప్రసిద్ధ్ కృష్ణ, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా ముగ్గురూ ఆడే అవకాశం ఉంది. స్పిన్ బాధ్యతలు కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా మీద ఉండనున్నాయి.

35
దక్షిణాఫ్రికా జట్టులోనూ కీలక మార్పులు

దక్షిణాఫ్రికా జట్టు ఈ సిరీస్‌కు ఆత్మవిశ్వాసంతో వచ్చింది. ట్రిస్టన్ స్టబ్స్‌ను జట్టు నుంచి తప్పించి డీవాల్డ్ బ్రెవిస్‌ను కొనసాగించడం ప్రధాన నిర్ణయం. తాజాగా అంతర్జాతీయ క్రికెట్‌కు తిరిగి వచ్చిన క్వింటన్ డి కాక్ ఈ సిరీస్‌లో ప్రోటీస్ కు కీలకం కానున్నాడు.

పేస్ విభాగంలో కగిసో రబాడా గాయం కారణంగా అందుబాటులో లేడు. అతని స్థానంలో మార్కో జాన్సన్, నాండ్రే బర్గర్, ఆటోనిల్ బార్ట్మాన్ ప్రధాన పేసర్లుగా ఉన్నారు. స్పిన్ యూనిట్‌ను కేశవ్ మహారాజ్ నడిపిస్తారు.

45
IND vs SA మ్యాచ్ ఎప్పుడు? ఎక్కడ? లైవ్ వివరాలు

మొదటి వన్డే తేదీ: నవంబర్ 30, ఆదివారం

గ్రౌండ్ : JSCA స్టేడియం, రాంచి

మ్యాచ్ ప్రారంభం: మధ్యాహ్నం 1:30 IST

టాస్: మధ్యాహ్నం 1:00 IST

టీవీ ప్రసారం: స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్

ఆన్‌లైన్ లైవ్ స్ట్రీమింగ్: జియోహాట్‌స్టార్ యాప్, వెబ్‌సైట్

ఇరుజట్ల ఫైనల్ ప్లేయింగ్ ఎలెవన్ టాస్ తర్వాత ప్రకటిస్తారు. రోహిత్, కోహ్లీ తిరిగి లైనప్‌లో ఉండటం వల్ల అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

55
IND vs SA పూర్తి జట్లు, హెడ్ టు హెడ్ రికార్డులు

భారత్ జట్టు: రోహిత్ శర్మ, యశస్వీ జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్ (కెప్టెన్, వికెట్‌కీపర్), రిషభ్ పంత్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, రుతురాజ్ గైక్వాడ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్షదీప్ సింగ్, ధ్రువ్ జురెల్

దక్షిణాఫ్రికా జట్టు: టెంబా బావుమా (కెప్టెన్), క్వింటన్ డి కాక్, ఐడెన్ మార్క్రామ్, డీవాల్డ్ బ్రెవిస్, ర్యాన్ రికెల్టన్, మార్కో జాన్సన్, లుంగి ఎంగిడి, నాండ్రే బర్గర్, కేశవ్ మహారాజ్, టొనీ డి జోర్జీ, ఆటోనిల్ బార్ట్మాన్, మ్యాథ్యూ బ్రెట్జ్కీ, ప్రెనెలాన్ సుబ్రాయెన్, రూబిన్ హెర్మాన్, కార్బిన్ బోష్

IND vs SA హెడ్ టు హెడ్

మొత్తం ఆడిన వన్డేలు 94

భారత్ విజయం 40

దక్షిణాఫ్రికా విజయం 51

ఫలితం రానివి 3

భారత్ ఈ సిరీస్‌ను 2027 ప్రపంచకప్ ప్రణాళికల దిశగా కీలకంగా భావిస్తోంది. రోహిత్, కోహ్లీ పునరాగమనంతో మ్యాచ్‌పై ఉత్కంఠ మరింత పెరిగింది.

Read more Photos on
click me!

Recommended Stories