Womens World Cup : భారత జట్టుదే గెలుపు.. దేశవ్యాప్తంగా ప్రత్యేక పూజలు

Published : Nov 02, 2025, 03:06 PM ISTUpdated : Nov 02, 2025, 03:19 PM IST

Womens World Cup : మహిళా వన్డే వరల్డ్ కప్ 2025 ఫైనల్ ముందు దేశవ్యాప్తంగా అభిమానులు హనుమాన్ చాలీసా పఠించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సౌతాఫ్రికాతో జరిగే ఫైనల్ లో టీమిండియా విజయం సాధిస్తుందనే గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

PREV
15
భారత అభిమానుల్లో ఉరకలేస్తున్న ఉత్సాహం

ఐసీసీ మహిళా వన్డే వరల్డ్ కప్ 2025 ఫైనల్ మ్యాచ్‌కు ముందు భారతదేశం మొత్తం ఉత్సాహంతో ఉప్పొంగుతోంది. నేవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఆదివారం భారత మహిళా జట్టు, సౌతాఫ్రికా మధ్య తుదిపోరు జరగనుంది. ఈ మ్యాచ్‌తో ప్రపంచానికి కొత్త మహిళా ఛాంపియన్ లభించనుంది. ఈ ఫైనల్ పోరులో టీమ్ ఇండియా విజయం సాధిస్తుందన్న నమ్మకం అభిమానుల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

భారత జట్టు ఇప్పటివరకు రెండు సార్లు ఫైనల్ చేరినప్పటికీ ట్రోఫీ గెలవలేకపోయింది. అయితే ఈ సారి పరిస్థితి భిన్నంగా ఉందని అభిమానులు అంటున్నారు. సెమీఫైనల్లో ఏడుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియాను భారత్ ఓడించడంతో గట్టి నమ్మకాన్ని కలిగించింది.

25
దేశవ్యాప్తంగా ప్రత్యేక పూజలు, ప్రార్థనలు

టీమిండియా విజయం కోసం దేశవ్యాప్తంగా ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించారు. ముఖ్యంగా వారణాసి, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌లలో అభిమానులు దేవాలయాల్లో పూజలు చేశారు. వారాణాసిలో అభిమానులు హనుమాన్ చాలీసా పఠించి భారత విజయాన్ని కోరుకున్నారు. ఒక అభిమాని మాట్లాడుతూ, “మేము భారత్ వరల్డ్ కప్ గెలవాలని హనుమాన్ చాలీసా పఠించాం. ఈ సారి చరిత్ర ఖచ్చితంగా భారత్ పేరుతో రాస్తారు” అని పేర్కొన్నారు.

అభిమానులు దీపాలు వెలిగిస్తూ, టీమ్ ఇండియాకు శుభాకాంక్షలు తెలిపారు. చాలామంది చేతుల్లో జాతీయ పతాకాలు పట్టుకుని ‘జై హింద్’ నినాదాలతో వీధుల్లోకి వచ్చారు.

35
ఆస్ట్రేలియా పై గెలుపు అభిమానుల విశ్వాసం పెంచింది

సెమీఫైనల్లో ఆస్ట్రేలియా జట్టుపై భారత్ చూపిన అద్భుత ప్రదర్శన అభిమానులలో కొత్త ఆశను నింపింది. “మేము ఆస్ట్రేలియాను ఓడించాం, ఇక సౌతాఫ్రికాను కూడా జయిస్తాం. ఈసారి టీమ్ ఇండియా తప్పక వరల్డ్ కప్ ట్రోఫీ గెలుస్తుంది” అని ఒక అభిమాని చెప్పారు.

భారత జట్టు బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ సమతుల్య ప్రదర్శన ఇస్తోందని అభిమానులు విశ్లేషిస్తున్నారు. క్రీడా పండితులూ భారత జట్టు మానసిక ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు.

45
ఫ్యాన్స్ హనుమాన్ చాలీసా పఠనంతో ఉత్సాహం

భారత్ విజయాన్ని కోరుతూ అనేక ప్రాంతాల్లో హనుమాన్ చాలీసా పఠనాలు జరిగాయి. కొన్ని ఆలయాల్లో మహిళా అభిమానులు కూడా ప్రత్యేక పూజలు చేశారు. “శ్రీరాముడి, హనుమంతుడి ఆశీర్వాదంతో భారత్ చరిత్ర సృష్టిస్తుంది” అని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేశారు.

ముంబైలో అభిమానులు ప్రత్యేక పూజలు, తిలకాలు పెట్టుకొని, జట్టు విజయాన్ని కోరుకున్నారు. సోషల్ మీడియాలో కూడా #TeamIndiaForCup, #HanumanChalisaForVictory అనే హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్‌లో ఉన్నాయి.

55
ఫైనల్‌లో చరిత్ర సృష్టించే అవకాశం

నేవీ ముంబై డీవై పాటిల్ స్టేడియంలో భారత్-సౌతాఫ్రికా మధ్య తుది పోరు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. సౌతాఫ్రికాకు ఇది తొలి ఫైనల్ కావడం విశేషం. రెండు జట్లు ఈ టోర్నీలో అద్భుత ఫామ్‌లో ఉన్నాయ.

భారత అభిమానులు మాత్రమే కాదు, మాజీ క్రికెటర్లు, క్రీడా ప్రముఖులు కూడా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. భారత మహిళా జట్టు ఆదివారం చరిత్ర సృష్టించే దిశగా అడుగులు వేయనుందని దేశమంతా ఎదురుచూస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories