World Cup: ముంబై వేదికగా జరిగే 2025 మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్‌కు భారత్, సౌతాఫ్రికా సిద్ధమయ్యాయి. అయితే ఈ కీలక మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. చిరుజల్లుల నుంచి భారీ వర్షం వరకు అవకాశం ఉన్నందున..
మహిళల వన్డే ప్రపంచకప్ 2025 తుది దశకు చేరుకుంది. నవీ ముంబై వేదికగా జరిగే ఫైనల్‌లో టీమిండియా సౌతాఫ్రికాతో తలపడనుంది. తొలి సెమీ ఫైనల్‌లో ఇంగ్లండ్‌ను ఓడించి సౌతాఫ్రికా ఫైనల్ చేరగా, రెండో సెమీ ఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను భారత్ చిత్తు చేసింది.
25
ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు
అయితే, ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. భారీ వర్షం లేకున్నా, చిరుజల్లులైనా మ్యాచ్‌కు అంతరాయం కలిగించే అవకాశం ఉంది. ఫైనల్ మ్యాచ్ రోజు 30-60 శాతం వర్షం పడే ఛాన్స్ ఉందని సమాచారం. ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డే కేటాయించారు.
35
మ్యాచ్ రద్దయ్యే భారీ వర్ష సూచన..
ఆదివారం కనీసం 20 ఓవర్ల ఆట సాధ్యం కాకపోతే, ఆగిపోయిన ఓవర్ల నుంచే రిజర్వ్ డే అయిన సోమవారం ఆటను కొనసాగిస్తారు. ఒకసారి టాస్ వేస్తే, ఆ మ్యాచ్‌ను లైవ్‌గా పరిగణిస్తారు. దురదృష్టవశాత్తు, సోమవారం కూడా వర్షం పడే అవకాశం ఉన్నప్పటికీ, మ్యాచ్ రద్దయ్యే భారీ వర్ష సూచన అయితే లేదు.
ఇది అభిమానులకు కొంత ఉపశమనం. ఒకవేళ రిజర్వ్ డే కూడా ఆట సాధ్యం కాకుండా మ్యాచ్ రద్దయితే, ఐసీసీ రూల్స్ ప్రకారం ఇరు జట్లను విజేతగా ప్రకటిస్తారు. రెండు రోజుల్లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఇరు జట్లు కనీసం 20 ఓవర్లు ఆడేలా చూస్తారు.
55
1983 సీన్‌ను మళ్లీ రిపీట్
అది కూడా సాధ్యం కాకపోతేనే మ్యాచ్‌ను రద్దు చేస్తారు. అయితే, ప్రస్తుతానికి అలాంటి పరిస్థితి అయితే లేదు. ఆస్ట్రేలియాను ఓడించిన భారత్ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. 1983 సీన్‌ను మళ్లీ రిపీట్ చేయాలని టీమిండియా ఉమెన్స్ ఉవ్విళ్ళూరుతున్నారు.