అండర్సన్-టెండూల్కర్ టెస్ట్ సీరిస్ లో సిరాజ్ ఓ అరుదైన రికార్డ్ సాధించాడు. ఈ ఐదు టెస్టుల సీరిస్ లో సిరాజ్ మొత్తం 1000 కి పైగా బంతులు వేశాడు. అయితే ఒకే సీరిస్ లో 1000 బంతులేసిన రికార్డ్ మహ్మద్ షమీ, జస్ప్రీత్ సింగ్ బుమ్రా, ఇషాంత్ శర్మ, జవగల్ శ్రీనాథ్, కపిల్ దేవ్ పేరిట ఉంది... కానీ గత నాలుగేళ్లలో ఈ ఘనత ఏ టీమిండియా క్రికెటర్ సాధించలేదు. ఇంగ్లాండ్ తో టెస్ట్ సీరస్ ద్వారా సిరాజ్ ఈ రికార్డ్ నెలకొల్పాడు.
సిరాజ్ ఐదు టెస్టుల్లో కలిపి 185.3 ఓవర్లు వేశాడు.. అంటే 1113 బంతులు వేశాడన్నమాట. మొత్తం 32.43 యావరేజ్ తో 746 పరుగులిచ్చిన ఇతడు 23 వికెట్లు పడగొట్టాడు. ఇందులో రెండుసార్లు ఐదువికెట్లు, ఓసారి 4 వికెట్ల ఫీట్ సాధించాడు.ఈ టెస్ట్ సీరిస్ లో అత్యధిక వికెట్ల రికార్డు కూడా సిరాజ్ దే.
ఓవల్ మ్యాచ్ లోనే మొదటి ఇన్నింగ్స్ లో 4, సెకండ్ ఇన్నింగ్ లో 5 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ ఓటమిని శాసించాడు సిరాజ్. ఇలా టీమిండియాను ఒంటిచేత్తో గెలిపించి హైదరబాదీలే కాదు యావత్ తెలుగు ప్రజలు గర్వపడేలా చేశాడు సిరాజ్.