ICC Women World Cup 2025 Prize Money: ఐసీసీ మహిళల వరల్డ్ కప్ 2025లో విజేతకు రికార్డు ప్రైజ్ మనీ అందించనున్నారు. విన్నర్ ₹39.7 కోట్లు, రన్నరప్ ₹19.8 కోట్లు అందుకుంటారు. ఇది పురుషుల వరల్డ్ కప్ ప్రైజ్ మనీ కంటే కూడా ఎక్కువ కావడం విశేషం.
ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ 2025: రికార్డు ప్రైజ్ మనీ
మహిళల క్రికెట్ చరిత్రలో ఇదే అత్యధిక బహుమతి మొత్తమని చెప్పవచ్చు. ఐసీసీ మహిళల క్రికెట్ వరల్డ్ కప్ 2025 ఫైనల్ విజేతలకు ₹39.77 కోట్లు, రన్నరప్ జట్టుకు ₹19.88 కోట్లు అందుకుంటాయి. ఇది పురుషుల వరల్డ్ కప్ 2023లో ఇచ్చిన మొత్తం ₹84 కోట్ల కంటే ఎక్కువ కావడం విశేషం. మొత్తం ప్రైజ్ పూల్ ₹123 కోట్లు (USD 13.88 మిలియన్) గా నిర్ణయించారు.
2022తో పోలిస్తే ఇది 297 శాతం పెరుగుదలగా ఉంది. 2022లో విజేత ఆస్ట్రేలియాకు సుమారు ₹11 కోట్లు లభించగా, ఇప్పుడు అది ₹39 కోట్లకు పైగా పెరిగింది. ఈ సారి విజేతకు లభించే మొత్తం ఐసీసీ పురుషుల వరల్డ్ కప్ 2023 కంటే కూడా ఎక్కువగా ఉంది.
26
చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా భారత జట్టు
హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత మహిళా జట్టు 2025 వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరింది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఆదివారం (నవంబర్ 2న) దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఇది భారత్‌కు మూడో వరల్డ్ కప్ ఫైనల్ కాగా, దక్షిణాఫ్రికాకు మొదటిసారి.
సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాపై అద్భుత విజయంతో భారత్ చరిత్రలో మొదటిసారి 339 పరుగుల ఛేజ్ సాధించింది. ఈ విజయం వారిని ఫైనల్‌కు చేర్చడమే కాకుండా కనీసం ₹20 కోట్ల బహుమతి మొత్తాన్ని అందుకుంటామనే హామీని కూడా ఇచ్చింది.
36
పురుషుల టోర్నీతో సమానంగా ముందడుగు
ఐసీసీ 2025 మహిళల వరల్డ్ కప్ ద్వారా మహిళా క్రికెట్‌కు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. ఈసారి విజేతలకు ₹39.7 కోట్లు, రన్నరప్‌కు ₹20 కోట్లు ఇవ్వడం ద్వారా లింగ సమానత్వానికి బలమైన సందేశం ఇచ్చింది.
ఐసీసీ చైర్మన్ జైషా మాట్లాడుతూ, “ఇది మహిళల క్రికెట్ అభివృద్ధికి గణనీయమైన మలుపు. మహిళా ప్లేయర్లు పురుషుల మాదిరిగానే గౌరవం, ప్రోత్సాహం పొందాలి” అని తెలిపారు.
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు
విజేత జట్టు: USD 4.48 మిలియన్ (₹39.77 కోట్లు)
రన్నరప్ జట్టు: USD 2.24 మిలియన్ (₹19.88 కోట్లు)
సెమీఫైనల్ చేరిన జట్లు: USD 1.12 మిలియన్ (₹9.88 కోట్లు)
5వ, 6వ స్థానాలు: USD 700,000 (₹6.17 కోట్లు)
7వ, 8వ స్థానాలు: USD 280,000 (₹2.3 కోట్లు)
టోర్నీలో పాల్గొన్న ప్రతి జట్టుకు : USD 250,000 (₹2.2 కోట్లు)
ప్రతి గ్రూప్ మ్యాచ్ విజయానికి: USD 34,000 (₹28 లక్షలు)
ఈ మొత్తాలు గత ఎడిషన్ కంటే మూడింతలు ఎక్కువ.
56
బీసీసీఐ నుండి టీమిండియాకు బిగ్ ఫ్రైజ్
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కూడా భారత జట్టు విజేతగా నిలిస్తే ₹125 కోట్ల ప్రత్యేక బహుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇది 2024లో టీ20 వరల్డ్ కప్ గెలిచిన రోహిత్ శర్మ జట్టుకు ఇచ్చిన మొత్తంతో సమానం కావడం విశేషం.
బీసీసీఐ వర్గాలు తెలిపినట్లుగా, “మా మహిళా ఆటగాళ్లు పురుషుల మాదిరిగానే గౌరవం, బహుమతి పొందాలి. అయితే అధికారిక ప్రకటన ఫైనల్ తర్వాత ఉంటుంది” అని తెలిపారు.
66
మహిళల క్రికెట్‌కు కొత్త యుగం
భారత్, దక్షిణాఫ్రికా రెండూ ఇప్పటివరకు మహిళల వరల్డ్ కప్ గెలవలేదు. ఈ ఫైనల్‌తో ఎవరు గెలిచినా ఒక కొత్త ఛాంపియన్ ను మనం చూస్తాము. భారత్ విజయం సాధిస్తే అది కేవలం ట్రోఫీ మాత్రమే కాదు.. మహిళల క్రికెట్‌లో సమాన హక్కుల, గౌరవాల చిహ్నంగా నిలుస్తుంది.