టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ విడుదల: ఒకే గ్రూప్ లో భారత్-పాక్.. మ్యాచ్ ఎప్పుడు?

Published : Nov 25, 2025, 09:29 PM IST

T20 World Cup 2026 Schedule: 2026 టీ20 వరల్డ్ కప్ పూర్తి షెడ్యూల్ ను ఐసీసీ విడుదల చేసింది. ఈ మెగా టోర్నమెంట్ కు భారత్, శ్రీలంకలు ఆతిథ్యం ఇస్తున్నాయి. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కోసం క్రికెట్ లవర్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

PREV
15
2026 టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ వచ్చేసింది

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) 2026 మెన్స్ టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ టోర్నీ భారత్, శ్రీలంక సంయుక్త ఆతిథ్యంలో జరగనుంది. ఈ మెగా టోర్నమెంట్ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు నెల రోజుల పాటు క్రికెట్ అభిమానులకు మరో పండగ ఉత్సాహాన్నిచ్చే విధంగా సాగనుంది.

ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు పాల్గొంటున్నాయి. ఎనిమిది స్టేడియాలు సిద్ధంగా ఉన్నాయి. నాలుగు గ్రూపులుగా 20 జట్లను విభజించారు. ప్రారంభ మ్యాచ్ ఫిబ్రవరి 7న కొలంబోలో పాకిస్థాన్, నెదర్లాండ్స్ మధ్య జరుగుతుంది. అదే రోజున ముంబై వేదికగా జరిగే భారత్ తొలి మ్యాచ్ ద్వారా టోర్నీకి మరింత హైప్ చేరనుంది.

25
భారత్ మ్యాచులు ఎప్పుడు? ఫిబ్రవరి 15న పాక్ తో బిగ్ ఫైట్

టీమిండియా గ్రూప్ Aలో పాకిస్తాన్, యూఎస్ఏ, నెదర్లాండ్స్, నమీబియాతో కలిసి ఉంది. గ్రూప్ దశలో భారత్ నాలుగు కీలక మ్యాచ్‌లు ఆడనుంది. ఆ షెడ్యూల్ ఇదే

  1. ఫిబ్రవరి 7 – యూఎస్ఏ vs భారత్ (ముంబై)
  2. ఫిబ్రవరి 12 – భారత్ vs నమీబియా (ఢిల్లీ)
  3. ఫిబ్రవరి 15 – భారత్ vs పాకిస్తాన్ (కొలంబో)
  4. ఫిబ్రవరి 18 – భారత్ vs నెదర్లాండ్స్ (అహ్మదాబాద్)

ఈ మ్యాచ్‌లలో పాక్‌తో ఫిబ్రవరి 15న జరగనున్న పోరు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించే హై వోల్టేజ్ ఎన్‌కౌంటర్‌గా భావిస్తున్నారు. ఈ మ్యాచ్‌ను కొలంబో ప్రేమదాస స్టేడియంలో నిర్వహించనున్నట్లు ఐసీసీ పేర్కొంది.

గ్రూప్ ఏలో పాకిస్థాన్‌ తప్ప ఇతర జట్లు భారత్ కు బలంగా పోటీని ఇచ్చే అవకాశాలు లేవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే వరల్డ్ కప్ వేదికపై ఏ జట్టును తేలికగా తీసుకోవడానికి లేదని టీమిండియా అభిమానులు, మాజీ ప్లేయర్లు హెచ్చరిస్తున్నారు.

35
టీ20 వరల్డ్ కప్ 2026 వేదికలు ఏవి? ఏ ఫార్మాట్ లో జరగనుంది?

టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్‌ను రెండు దేశాలు కలిసి నిర్వహించనున్నాయి. ఈసారి వేదికల సంఖ్య ఎనిమిది. భారత్‌లోని అహ్మదాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా వేదికలు ప్రధాన మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తాయి. శ్రీలంకలోని కొలంబోలోని రెండు స్టేడియాలు, కాండీ వేదికయ్యాయి.

  • 20 జట్లు → 4 గ్రూపులు (5 జట్లు చొప్పున)
  • ప్రతి గ్రూప్ నుంచి టాప్ 2 జట్లు → సూపర్ 8 అర్హత సాధిస్తాయి
  • సూపర్ 8 నుంచి టాప్ 4 → సెమీఫైనల్స్ కు వెళ్తాయి
  • మార్చి 8 → అహ్మదాబాద్‌లో ఫైనల్ మ్యాచ్ ఉంటుంది

పాకిస్తాన్ మాత్రం భద్రతా ఒప్పందాల నేపథ్యంలో తన అన్ని గ్రూప్ మ్యాచ్‌లను శ్రీలంకలోనే ఆడనుంది. ఆసక్తికరంగా, పాకిస్తాన్ ఫైనల్‌కు అర్హత సాధిస్తే ఫైనల్‌ను కూడా కొలంబోలోనే నిర్వహిస్తామని ఐసీసీ తెలిపింది.

45
టీ20 వరల్డ్ కప్ 2026 నాలుగు గ్రూప్‌లు, జట్ల వివరాలు ఇవే

టీ20 వరల్డ్ కప్ 2026 ఎడిషన్‌లో కొన్ని కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. వాటిలో ఇటలీ తొలిసారిగా వరల్డ్ కప్‌ అర్హత సాధించింది.

  • గ్రూప్ A : భారత్, పాకిస్తాన్, యూఎస్ఏ, నెదర్లాండ్స్, నమీబియా
  • గ్రూప్ B : ఆస్ట్రేలియా, శ్రీలంక, ఐర్లాండ్, జింబాబ్వే, ఒమన్
  • గ్రూప్ C : ఇంగ్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, నేపాల్, ఇటలీ
  • గ్రూప్ D : న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, అఫ్ఘానిస్తాన్, కెనడా, యూఏఈ

సూపర్ 8 దశలో భారత మ్యాచ్‌లకు అహ్మదాబాద్, కోల్‌కతా, చెన్నై వేదికలుగా నిర్ణయించే అవకాశం ఉంది.

55
బ్రాండ్ అంబాసిడర్‌గా రోహిత్ శర్మ

గత ఎడిషన్‌లో టీమిండియాకు ట్రోఫీ అందించిన రోహిత్ శర్మకు ఐసీసీ ఈ వరల్డ్ కప్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రత్యేక గుర్తింపు ఇచ్చింది. ముంబైలో జరిగిన షెడ్యూల్ ప్రకటనా కార్యక్రమంలో రోహిత్ “ICC ట్రోఫీ గెలవడం అతి కష్టం, కానీ భారత జట్టు మళ్లీ అదే మ్యాజిక్ సాధిస్తుందని నమ్మకం ఉంది” అని చెప్పారు.

Read more Photos on
click me!

Recommended Stories