స్మృతి మంధానతో పెళ్లి పై పలాష్ ముచ్చల్ తల్లి షాకింగ్ కామెంట్స్

Published : Nov 25, 2025, 05:39 PM IST

Smriti Mandhana Palash Muchhal : స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ వివాహం నవంబర్ 23న జరగాల్సి ఉంది. స్మృతి తండ్రితో పాటు వరుడు పలాష్‌కు అకస్మాత్తు ఆరోగ్య సమస్యలు రావడంతో పెళ్లి వాయిదా పడింది. అయితే, చాట్ లీక్ మధ్య పలాష్ తల్లి కామెంట్స్ వైరల్ గా మారాయి.

PREV
15
స్మృతి తండ్రి అనారోగ్యంతో పెళ్లికి బ్రేక్

భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన వివాహం అభిమానుల్లో ఎన్నో రోజులు ఆసక్తిని రేకెత్తించింది. సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్తో ఆమె పెళ్లి నవంబర్ 23న జరగాల్సి ఉండగా, అనుకోని ఆరోగ్య సమస్యలు ఈ వేడుకను వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది. 

స్మృతి మంధాన తండ్రి శ్రీనివాస్ మంధాన గుండెపోటు రావడంతో అత్యవసరంగా వైద్యం అందించాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో పెళ్లి కార్యక్రమాలు నిర్వహించడం సాధ్యం కాకపోవడంతో, కుటుంబాలు ఒకటిగా నిర్ణయం తీసుకుని వివాహాన్ని నిలిపివేశాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ విషయాన్ని పలాష్ ముచ్చల్ సోదరి పాలక్ ముచ్చల్ అధికారికంగా ప్రకటించారు.

ఆమె మాట్లాడుతూ.. "స్మృతి తండ్రి అనారోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, రెండు కుటుంబాలు కలిసి వివాహాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నాయి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో మా కుటుంబాల గోప్యతను గౌరవించాలని వినమ్రంగా కోరుతున్నాం" అని పేర్కొన్నారు.

25
అనారోగ్యంతో ఆస్పత్రిలో పలాష్ ముచ్చలు

ఇంతలో పలాష్ ముచ్చల్ కూడా ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. అతని అనారోగ్యంపై స్పష్టమైన వివరాలు బయటకు రాకపోయినా, కొన్ని మీడియా నివేదికల ప్రకారం అతని ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడం కుటుంబాలను తీవ్ర ఆందోళనకు గురిచేసింది.

35
పలాష్ ముచ్చలు తల్లి ఏం చెప్పారంటే?

ఈ నేపథ్యంలోనే పలాష్ తల్లి అమిత ముచ్చల్ మాట్లాడుతూ.. "పలాష్‌ తీవ్ర ఒత్తిడితో అస్వస్థతకు గురయ్యాడు. ఆసుపత్రిలో నాలుగు గంటలపాటు చికిత్స అందించారు. ఈసీజీ సహా పలు పరీక్షలు నిర్వహించారు. ఇప్పుడు కొంత స్థిరంగా ఉన్నాడు కానీ మానసిక ఒత్తిడి మాత్రం ఎక్కువగానే ఉంది" అని చెప్పారు.

అలాగే, పలాష్ ముచ్చల్‌కు స్మృతి మంధాన తండ్రి చాలా క్లోజ్ గా ఉండేవారనీ, ఆయన అనారోగ్యానికి గురికాగానే స్మృతి కంటే ముందే పెళ్లిని పలాష్ వాయిదా వేయాలనే నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.

45
స్మృతి ఇన్‌స్టాగ్రామ్ నుండి ఫోటోలు డిలీట్ తో కొత్త చర్చ

అయితే, పెళ్లి వాయిదా పరిస్థితులు గందరగోళంగా ఉన్న వేళ, స్మృతి తన ఇన్‌స్టాగ్రామ్‌లోని పలాష్‌తో ఉన్న అన్ని ఫోటోలు, వీడియోలను తొలగించడం అభిమానుల్లో కొత్త అనుమానాలకు కారణమైంది. ఇది వ్యక్తిగత ఒత్తిడి కారణమా? లేక మరేదైనా కారణమా? అన్న ప్రశ్నలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి.

ముంబైలోని ఎస్ఆర్వీ ఆసుపత్రి వద్ద మంగళవారం ఉదయం పాలక్ కనిపించినప్పటికీ, ఆమె ఎందుకు అక్కడికి వచ్చిందనే విషయం వెల్లడించలేదు. అయితే ఇది పలాష్ ఆరోగ్యంతో సంబంధం ఉందన్న అనుమానం మాత్రం అభిమానుల్లో పెరిగింది.

55
సోషల్ మీడియాలో పలాష్‌పై విమర్శలు

అయితే, మంధానను చీట్ చేశారనీ, మరో మహిళతో అతను సంబంధం పెట్టుకున్నాడంటూ సోషల్ మీడియాలో లీక్ అయిన చాట్ వైరల్ గా మారింది. దీంతో సోషల్ మీడియాలో పలాష్‌ను కొంతమంది ట్రోల్ చేయడం ప్రారంభించారు. "స్మృతి ప్రపంచకప్ గెలిచిన వుమెన్ ప‌వ‌ర్‌ను చూపించింది, కానీ ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొవడం ఆమెకు కష్టం" అని కామెంట్లు కూడా వచ్చాయి.

ఈ విషయంపై స్మృతి లేదా పలాష్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కుటుంబ వర్గాలు మాత్రం ఈ సంఘటనలన్నీ అనుకోని ఒత్తిడికి దారి తీసినవేనని చెబుతున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories