అమ్మతనానికి ఆదర్శం.. 30 లీటర్ల చనుబాలు దానం చేసిన గుత్తా జ్వాల

Published : Sep 12, 2025, 10:49 PM IST

Gutta Jwala: భారత బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలా 4 నెలల్లో 30 లీటర్ల చనుబాలను దానం చేశారు. రోజూ 600 మి.లీ. పాలు ప్రభుత్వ ఆస్పత్రులకు అందజేస్తూ అమ్మతనానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

PREV
15
అరుదైన మానవతా సేవలో గత్తా జ్వాల

భారత బ్యాడ్మింటన్ రంగంలో అనేక విజయాలు సాధించిన గుత్తా జ్వాల ఇప్పుడు ప్రత్యేకమైన మానవతా సేవతో వార్తల్లో నిలిచారు. కూతురు పుట్టిన తరువాత తల్లిపాలు పంచుతూ అమ్మతానికి అదర్శంగా నిలస్తున్నారు. తల్లి పాలకు దూరమైన శిశువులకు జీవదాతగా నిలుస్తున్నారు. గత నాలుగు నెలల్లోనే ఆమె సుమారు 30 లీటర్ల పాలు దానం చేశారు.

25
రోజూ 600 మి.లీ. చనుబాలు ప్రభుత్వ ఆస్పత్రులకు అందిస్తున్న గుత్తా జ్వాల

గుత్తా జ్వాల తన శిశువుకు పాలు ఇచ్చిన తరువాత మిగిలిన పాలను వృధా చేయకుండా ప్రతిరోజూ ప్రభుత్వ ఆస్పత్రుల శిశువులకు పంపుతున్నారు. ప్రస్తుతం రోజూ సుమారు 600 మి.లీ. పాలు అందజేస్తున్నారు. భారత క్రీడా చరిత్రలో ఒక క్రీడాకారిణి ఇలాంటి ప్రయత్నం చేయడం ఇదే మొదటిసారి.

35
తల్లి పాలు శిశువులకు అమృతం కంటే ఎక్కువ

వైద్యుల ప్రకారం, తల్లి పాలు శిశువులకు అమృతం వంటివి. ఇందులో శిశువుల ఎదుగుదలకు అవసరమైన అన్ని పోషకాలు ఉంటాయి. ఇవి శిశువులను అలర్జీలు, ఆస్తమా, అధిక బరువు వంటి సమస్యల నుంచి కాపాడుతాయి. అనేక రకాల అనారోగ్యాలను దరిచేరనివ్వవు. గుత్తా జ్వాల చేసిన ఈ దానం కేవలం సహాయం మాత్రమే కాదు, వందలాది శిశువులకు ప్రాణదానం కూడా అవుతుంది.

45
తమిళ నటుడు విష్ణు విశాల్‌ను వివాహం చేసుకున్న గుత్తా జ్వాల

గుత్తా జ్వాల 2021 ఏప్రిల్ 22న తమిళ నటుడు విష్ణు విశాల్‌ను వివాహం చేసుకున్నారు. నాలుగేళ్ల తరువాత ఆమెకు కూతురు పుట్టింది. అమ్మతనాన్ని ఆస్వాదిస్తున్న ఆమె, తన శిశువు పాలు తాగిన తరువాత మిగిలిన పాలను మరింత మంది  శిశువుల కోసం దానం చేస్తున్నారు. ఇది సమాజానికి ఓ స్ఫూర్తిదాయకమైన చర్యగా నిలుస్తోంది.

55
గుత్తా జ్వాల క్రీడా జీవితం

గుత్తా జ్వాల భారత బ్యాడ్మింటన్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు. ఆమె 2010, 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకాలు గెలిచారు. అశ్విని పొన్నప్పాతో కలిసి డబుల్స్ విభాగంలో అనేక విజయాలు సాధించారు. 2011లో బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచారు. 2014లో థామస్ అండ్ ఉబర్ కప్‌లోనూ కాంస్యం సాధించారు.

అంతర్జాతీయ స్థాయిలో ఆమె సాధించిన విజయాలు భారత డబుల్స్ బ్యాడ్మింటన్‌కు గ్లోబల్ గుర్తింపును తెచ్చాయి. 2011లో అర్జున అవార్డు అందుకున్న గుత్తా జ్వాల.. తన కెరీర్‌లో మిక్స్‌డ్ డబుల్స్‌లో 6వ ర్యాంక్, మహిళల డబుల్స్‌లో 10వ ర్యాంక్ సాధించిన ఏకైక భారతీయురాలుగా ఘనత సాధించారు.

Read more Photos on
click me!

Recommended Stories