Abhishek Sharma : టీ20 ప్రపంచకప్ 2026 సూపర్ 8లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో భారత్ ఓడిపోయింది. ఆ తర్వాత యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మతో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ బస్సులో సీరియస్‌గా మాట్లాడుతున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
జింబాబ్వే మ్యాచ్ ముందే గంభీర్ సీరియస్ వార్నింగ్.. ఆ స్టార్ ప్లేయర్ అవుట్?
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా సూపర్ 8 దశలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ ఓటమి తర్వాత టీమిండియాలో ప్రక్షాళన దిశగా అడుగులు పడుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న తరుణంలో, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అతనికి టీమ్ బస్సులోనే క్లాస్ తీసుకుంటున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.
26
ఎయిర్‌పోర్ట్ బస్సులో గంభీర్, అభిషేక్ సీరియస్ చర్చ
దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ముగిసిన తర్వాత సోమవారం టీమిండియా ఆటగాళ్లు చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి హోటల్‌కు వెళ్లేందుకు ఆటగాళ్లందరూ టీమ్ బస్సు ఎక్కుతుండగా కెమెరా కళ్లు ఈ దృశ్యాలను బంధించాయి. బస్సులో డ్రైవర్ సీటు వెనుక వరుసలో కూర్చున్న గౌతమ్ గంభీర్, తన ముందున్న సీటులో కూర్చున్న అభిషేక్ శర్మతో అత్యంత గంభీరంగా చర్చిస్తూ కనిపించారు. గంభీర్ ఏదో సీరియస్‌గా వివరిస్తుండగా, అభిషేక్ శర్మ తల దించుకుని శ్రద్ధగా వింటున్నట్లు వీడియోలో స్పష్టమవుతోంది.
36
అభిషేక్ శర్మ వరుస వైఫల్యాలు
ఈ టోర్నీలో టీమ్ మేనేజ్‌మెంట్ అభిషేక్ శర్మపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ, అతను దారుణంగా విఫలమవుతున్నాడు. ఈ ప్రపంచకప్‌లో అతని గణాంకాలను పరిశీలిస్తే.. 0, 0, 0, 15 పరుగులుగా ఉన్నాయి. అమెరికా, పాకిస్థాన్, నెదర్లాండ్స్‌తో జరిగిన గ్రూప్ దశ మ్యాచ్‌ల్లో అతను ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన కీలకమైన సూపర్ 8 మ్యాచ్‌లో 12 బంతుల్లో 15 పరుగులు చేసి ఆశలు రేపినప్పటికీ, భారీ స్కోరు చేయలేకపోయాడు. వరుసగా విఫలమవుతున్నప్పటికీ అతనికి అవకాశాలు ఇస్తున్న గంభీర్, అతని వైఖరిపై అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది.
సూపర్ 8లో దక్షిణాఫ్రికా నిర్దేశించిన భారీ లక్ష్య ఛేదనలో టీమ్ ఇండియా తడబడింది. కేవలం 76 పరుగుల తేడాతో భారీ ఓటమిని మూటగట్టుకుంది. టాప్ ఆర్డర్ బ్యాటర్లు అభిషేక్ శర్మ, తిలక్ వర్మ పరుగులు సాధించడంలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వీరిద్దరి వైఫల్యం జట్టు సెమీఫైనల్ ఆశలను ప్రమాదంలో పడేసింది. ఈ నేపథ్యంలోనే గంభీర్ నేరుగా రంగంలోకి దిగి, టెక్నికల్ మార్పులు లేదా మానసిక ధైర్యం కల్పించే దిశగా అభిషేక్‌తో చర్చించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
56
జింబాబ్వేతో చావో రేవో
ఫిబ్రవరి 26న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జింబాబ్వేతో భారత్ తలపడనుంది. సెమీఫైనల్ రేసులో నిలవాలంటే భారత్ ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిందే. ఈ కీలక పోరాటానికి ముందు గంభీర్ నేరుగా ఆటగాళ్లతో మాట్లాడటం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే కొందరు నెటిజన్లు మాత్రం ఇలా బహిరంగంగా బస్సులో చర్చించడం సరికాదని, రోహిత్ శర్మ మాదిరిగా ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేయాలని అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం గంభీర్ ప్రత్యక్ష పర్యవేక్షణ జట్టుకు మేలు చేస్తుందని సమర్థిస్తున్నారు.
66
భారత జట్టులో మార్పులు ఖాయమా?
వరుస వైఫల్యాల నేపథ్యంలో జింబాబ్వేతో జరగబోయే మ్యాచ్‌లో ఓపెనింగ్ జోడీలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. గంభీర్ ఇచ్చిన సూచనలు అభిషేక్ శర్మను గాడిలో పెడతాయా లేదా అతడిని పక్కన పెట్టి మరో ఆటగాడికి అవకాశం ఇస్తారా అనేది వేచి చూడాలి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో మాత్రం టీమ్ ఇండియా శిబిరంలో నెలకొన్న ఉత్కంఠతను, గంభీర్ కఠినమైన కోచింగ్ శైలిని ప్రతిబింబిస్తోంది.