Dinesh Lad: క్రికెట్ లోనే కాదు సమాజసేవలోనూ ద్రోణాచార్యుడే.. ఏసియానెట్ ఎక్స్​క్లూజివ్ ఇంటర్వ్యూ

Published : Nov 12, 2025, 04:58 PM IST

Dinesh Lad: రోహిత్ శర్మ, శార్దూల్ ఠాకూర్‌ల కోచ్ దినేష్ లాడ్ ఇప్పుడు పేద పిల్లల కోసం సమాజసేవలోనూ ముందున్నారు. భవిష్యత్తు క్రికెట్ స్టార్‌లను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.

PREV
16
ద్రోణాచార్య దినేష్ లాడ్ – సమాజసేవలో కొత్త దారి

భారత క్రికెట్‌లో అత్యంత గౌరవనీయమైన కోచ్‌లలో ఒకరైన దినేష్ లాడ్ ఇప్పుడు మరో కోణంలో వార్తల్లో నిలిచారు. రోహిత్ శర్మ, శార్దూల్ ఠాకూర్‌ల వంటి ప్రతిభావంతుల్ని తయారుచేసిన ఈ గురువు ఇప్పుడు పేద పిల్లలకు ఆశాకిరణంగా నిలుస్తున్నారు. ఆయన లక్ష్యం స్పష్టంగా ఉంది.. భవిష్యత్తు రోహిత్ శర్మలను తయారు చేయండ,  వారిని చదువు, క్రీడలలో ముందుకు నడిపించడం.

దినేష్ లాడ్ సామాజిక సేవకు నడుం బిగించారు. ఆయన ద్రోణాచార్య అవార్డుతో పాటు ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. క్రికెట్ ప్రపంచంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇప్పుడు క్రికెట్‌కు ఆవల కూడా సమాజానికి తన వంతు సేవ చేస్తున్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలకు అండగా నిలుస్తున్నారు.

26
మహారాష్ట్ర, ఆంధ్ర, గుజరాత్ పిల్లల దత్తత

మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, గుజరాత్‌లోని గ్రామీణ ప్రాంతాల నుంచి పలువురు పిల్లలను దత్తత తీసుకున్నట్లు దినేష్ లాడ్ ఏషియానెట్ న్యూస్‌ ఎక్స్​క్లూజివ్ ఇంటర్వ్యూ లో చెప్పారు. వారిని ముంబైకి తీసుకొచ్చి పాఠశాలలో చేర్పించడం, నివాసం, చదువుతో పాటు క్రికెట్ శిక్షణ బాధ్యత కూడా తీసుకున్నారు. ఈ పిల్లలు జీవితంలో విజయం సాధించేలా దినేష్ కృషి చేస్తున్నారు.

36
దినేష్ లాడ్ మానవతా దృక్పథం

ముంబైలో ఐదుగురు పిల్లలు, వారి తల్లిదండ్రుల నివాసానికి ఏర్పాట్లు చేసినట్లు దినేష్ లాడ్ తెలిపారు. వారు అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఆ అద్దెను దినేషే భరిస్తున్నారు. ఈ పిల్లలు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే క్రికెట్ ఆడే అవకాశం ఉండేది కాదు. చదువుకోవడానికి కూడా పెద్దగా అవకాశాలు లేవు. అందుకే వారిని ముంబైకి తీసుకువచ్చామని చెప్పారు.

46
పిల్లల ఆహార బాధ్యత కూడా దినేష్ లాడ్ తీసుకున్నారు

దినేష్ లాడ్ ఈ పిల్లల ఆహార బాధ్యత కూడా తీసుకున్నారు. ప్రతి రెండు నెలలకు ఒక్కసారి ఆయన స్వయంగా ఈ పిల్లలకు ధాన్యం, అవసరమైన ఆహార పదార్థాలు అందజేస్తారు. క్రికెట్ ఆడటానికి కావలసిన క్రీడా సామగ్రి కూడా ఆయనే అందిస్తున్నారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, పూర్తి స్థాయి సహాయం అందించాలన్నదే ఆయన సంకల్పం.

56
వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుతున్న పిల్లలు

ఈ పిల్లలందరూ ప్రస్తుతం ముంబైలోని స్వామి వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుతున్నారు. చదువుతో పాటు క్రికెట్‌లోనూ తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. నగర వాతావరణంలో ఉన్న అవకాశాలను ఉపయోగించుకుంటూ, వీరు పెద్ద క్రికెటర్లవైపు అడుగులు వేస్తున్నారు. దినేష్ లాడ్ ఇచ్చిన ప్రోత్సాహం వారికి ప్రేరణగా మారింది. “ఈ పిల్లలు భవిష్యత్తులో రోహిత్ శర్మలుగా ఎదగడం నా కల” అని ఆయన అన్నారు.

66
సామాజిక సేవను కొనసాగిస్తానంటున్న దినేష్ లాడ్

దినేష్ లాడ్ మాట్లాడుతూ, “నేను ఈ సమాజసేవను నిరంతరం కొనసాగిస్తాను. ఈ పిల్లలు మంచి విద్య పొందాలి, జీవితంలో ఎదగాలి, అది నా బాధ్యత” అని అన్నారు. ఆయన చెప్పిన ఈ మాటలు ఒక కోచ్‌గానే కాదు, ఒక మానవతావాది హృదయాన్ని కూడా ప్రతిబింబిస్తాయి. ఆయన చర్యలు చాలా మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories