SRH అకౌంట్ ఖాళీ.. రోహిత్ శర్మ షాక్ ! నెట్టింట సెగలు పుట్టిస్తున్న పాక్ ప్లేయర్ ఇష్యూ

Published : Mar 17, 2026, 06:57 PM IST

Sunrisers Hyderabad : ది హండ్రెడ్ లీగ్‌లో కావ్య మారన్ జట్టు పాక్ స్పిన్నర్‌ను కొనడంతో వివాదం రేగింది. ఈ క్రమంలో రోహిత్ శర్మ, ముంబై ఇండియన్స్ సన్‌రైజర్స్‌ హైదారాబాద్ ను అన్‌ఫాలో చేశారన్న వార్తలు వైరల్ గా మారాయి.

PREV
16
పాక్ ప్లేయర్ కోసం భారతీయుల మనోభావాలతో ఆటలా? SRHకు ముంబై ఇండియన్స్ షాక్

ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభానికి ముందే క్రికెట్ ప్రపంచంలో పెను ప్రకంపనలు మొదలయ్యాయి. కావ్య మారన్‌కు చెందిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఫ్రాంచైజీ, తమ సోదర జట్టు సన్‌రైజర్స్ లీడ్స్ కోసం పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను కొనుగోలు చేయడం ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీసింది. బ్రిటన్ లో జరిగే 'ది హండ్రెడ్' లీగ్ కోసం సుమారు 1.90 లక్షల పౌండ్లు (దాదాపు రూ. 2.34 కోట్లు) వెచ్చించి ఈ పాక్ ప్లేయర్‌ను సొంతం చేసుకోవడం భారత నెటిజన్లకు ఆగ్రహం తెప్పించింది. ఈ వివాదం నేపథ్యంలో రోహిత్ శర్మ, ముంబై ఇండియన్స్ జట్టు సన్‌రైజర్స్‌ను సోషల్ మీడియాలో బాయ్‌కాట్ చేశారనే వార్తలు వైరల్ అవుతున్నాయి.

26
వైరల్ అవుతున్న సోషల్ మీడియా పోస్టులు

పాకిస్థాన్ ఆటగాడిని కొనుగోలు చేయడం ద్వారా కావ్య మారన్ భారతీయుల మనోభావాలను దెబ్బతీశారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ (MI) తమ ఇన్ స్టాగ్రామ్ ఖాతాల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను అన్‌ఫాలో చేశారనే వాదనలు తెరపైకి వచ్చాయి. "దేశమే అన్నిటికంటే ముఖ్యం" అనే నినాదంతో రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయాన్ని అభిమానులు ప్రశంసిస్తూ ఎక్స్ లో స్క్రీన్ షాట్లను షేర్ చేస్తున్నారు.

36
నిజానిజాలు ఏమిటి? ఇన్ స్టాగ్రామ్ ఏం చెబుతోంది?

ఈ ప్రచారంపై వాస్తవాలను పరిశీలించగా కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముంబై ఇండియన్స్ అధికారిక ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఫాలోయింగ్ సెక్షన్‌ను చూడగా, అందులో సన్‌రైజర్స్ హైదరాబాద్ అకౌంట్ ఇంకా కనిపిస్తూనే ఉంది. అంటే ముంబై ఇండియన్స్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును అన్‌ఫాలో చేసిందనే ప్రచారంలో నిజం లేదని స్పష్టమవుతోంది. ఆన్‌లైన్ క్లెయిమ్స్ అన్నీ కేవలం ఊహాగానాలేనని దీని ద్వారా తెలుస్తోంది.

46
రోహిత్ శర్మ ఖాతాలో అసలు సీన్ ఇదీ..

మరోవైపు, రోహిత్ శర్మ వ్యక్తిగత ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్‌ను పరిశీలించినప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాద్ అకౌంట్ అతని ఫాలోయింగ్ జాబితాలో కనిపించలేదు. అయితే, ఈ వివాదం కంటే ముందే రోహిత్ శర్మ హైదరాబాద్ ఫ్రాంచైజీని ఫాలో అయ్యేవాడా లేదా అనేది స్పష్టంగా తెలియడం లేదు. రోహిత్ శర్మ ఎప్పుడూ కూడా అన్ని ఐపీఎల్ జట్లను ఫాలో అవ్వడు. కాబట్టి ఇప్పుడు కొత్తగా అన్‌ఫాలో చేశాడా లేక ముందే ఫాలో అవ్వలేదా అన్నది అధికారికంగా ధ్రువీకరించలేని విషయం.

56
దేశం పట్ల రోహిత్ నిబద్ధతపై ప్రశంసలు

సోషల్ మీడియా వినియోగదారులు మాత్రం రోహిత్ శర్మను ఆకాశానికెత్తేస్తున్నారు. "దేశం విషయానికి వస్తే హిట్ మ్యాన్ ఎప్పుడూ ముందుంటాడు" అని ఒక నెటిజన్ పేర్కొన్నాడు. పాకిస్థాన్ ఆటగాళ్లను ఐపీఎల్‌లో నిషేధించినప్పటికీ, విదేశీ లీగ్లలో వారిని కొనడం ద్వారా సన్‌రైజర్స్ యాజమాన్యం తప్పుడు సంకేతాలు పంపిందని, అందుకే ఇతర ఫ్రాంచైజీలు వారిని బాయ్‌కాట్ చేస్తున్నాయని మరికొందరు పోస్టులు పెడుతున్నారు.

66
ఐపీఎల్ 2026 అంతా రెడీ

మరోవైపు, ఐపీఎల్ 2026 మార్చి 28 నుండి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తలపడనున్నాయి. ఇక ముంబై ఇండియన్స్ తన తొలి మ్యాచ్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మార్చి 29న ఆడనుంది. మైదానంలో పోటీ కంటే ముందే సోషల్ మీడియాలో ఈ అన్‌ఫాలో వివాదం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Read more Photos on
click me!

Recommended Stories