ఇదే లాంగ్ జంప్ ఫైనల్‌లో పాల్గొన్న మరో భారత అథ్లెట్ లోకేష్ తన తొలి కామన్వెల్త్ గేమ్స్‌లోనే 7.97 మీటర్లు దూకి ఐదో స్థానంలో నిలిచాడు. కామన్వెల్త్ గేమ్స్ 7వ రోజున భారత్ గెలుచుకున్న మూడు పతకాల్లో శ్రీశంకర్ సిల్వర్ ఒకటి. దీంతో గ్లాస్గో గేమ్స్‌లో భారత్ మొత్తం పతకాల సంఖ్య 15కు చేరింది. ఇందులో 3 గోల్డ్, 9 సిల్వర్, 3 బ్రోంజ్ మెడల్స్ ఉన్నాయి.
ఇప్పటివరకు భారత్ తరఫున మీరాబాయి చాను (వెయిట్‌లిఫ్టింగ్), షర్మిలా ధంకార్ (ఉమెన్స్ షాట్‌పుట్ F57), దిలీప్ మహాదు గావిట్ (మెన్స్ T47 100m) గోల్డ్ మెడల్స్ సాధించారు.
మొహమ్మద్ బాసిల్ మోర్సింగనక్త్ (రన్నింగ్), మురళి శ్రీశంకర్ (లాంగ్ జంప్), రిషికాంత్ సింగ్, ముత్తుపాండి రాజా, జ్ఞానేశ్వరి యాదవ్, హర్జిందర్ కౌర్, వల్లూరి అజయ్ బాబు (వెయిట్‌లిఫ్టింగ్), సర్వేష్ కుషారే (హై జంప్), గుల్వీర్ సింగ్ (10,000m పరుగు) రజత పతకాలు సాధించారు. అలాగే బింద్యారాణి దేవి (వెయిట్‌లిఫ్టింగ్), శిల్ప కె. శైల (ఉమెన్స్ షాట్‌పుట్ F57), ఝండు కుమార్ (పారా పవర్‌లిఫ్టింగ్) కాంస్య పతకాలు గెలుచుకున్నారు.