Published : Jul 29, 2026, 06:26 PM ISTUpdated : Jul 29, 2026, 06:44 PM IST
ఐసీసీ మెన్స్ క్రికెట్ ర్యాంకింగ్స్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కి సూపర్ ర్యాంక్ దక్కింది. జింబాబ్వే సిరీస్‌లో అదరగొట్టిన ఈ భారత కుర్రాడు టీ20 ర్యాంకింగ్స్‌లో ఏకంగా 230 స్థానాలు ఎగబాకాడు. మరి ప్రస్తుతం అతడి ర్యాంక్ ఎంతో తెలుసా?
టీమిండియా, జింబాబ్వే మధ్య టీ20 సిరీస్ ముగిసిన వెంటనే ఐసీసీ కొత్త వన్డే, టీ20, టెస్ట్ ర్యాంకింగ్స్‌ను రిలీజ్ చేసింది. అయితే ఐసిసి టీ20 ర్యాంకింగ్స్ లో ఓ ఆశ్చర్యకర పరిణామం చోటుచేసుకుంది. ఇండియన్ యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశి ఏకంగా 230 స్థానాలు పైకి ఎగబాకి 48వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఇలా ఇంటర్నేషనల్ క్రికెట్లో అడుగుపెట్టి అలా ఐసిసి ర్యాంకింగ్స్ లో దూకుడుగా ముందుకు సాగుతున్నాడు ఈ కుర్రాడు. అతడు ఇలాగే దూసుకుపోతే టీ20 ఫార్మాట్ లో టాప్ బ్యాటర్ గా మారడం ఖాయం.
ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు వైభవ్. అయితే ఈ సీరిస్ లో నిరాశపరిచిన 15 ఏళ్ల బుడ్డోడు వెంటనే జింబాబ్వే సిరీస్‌లో ఫామ్‌లోకి వచ్చాడు. జింబాబ్వేపై మొదటి మ్యాచ్‌లో 50, మూడో టీ20లో ఏకంగా 81 పరుగులతో చెలరేగాడు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో మొత్తం 151 పరుగులు చేసి 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్' అవార్డు కూడా గెలుచుకున్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో అదరగొట్టి టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు వైభవ్... ఇలా ఇంటర్నేషనల్ కెరీర్ ప్రారంభించిన అతి తక్కువ సమయంలో అత్యుత్తమ ర్యాంకు సాధించాడు. ఒకేసారి 230 స్థానాలు మెరుగుపర్చుకోవడం అంటే మామూలు విషయం కాదు. తన ధనాధన్ బ్యాటింగ్ తో పరుగుల వరద పారిస్తూ ఎన్నో రికార్డులు బద్దలుగొట్టిన వైభవ్ ఇప్పుడు టీ20 ర్యాంకింగ్స్ లో కూడా రికార్డు నెలకొల్పాడు.
24
టాప్ 20లో సూర్యకుమార్ యాదవ్
మిగతా భారత ఆటగాళ్ల విషయానికొస్తే... టీమిండియా టీ20 టీమ్ వైస్ కెప్టెన్, హైదరబాదీ క్రికెటర్ తిలక్ వర్మ కూడా రెండు స్థానాలు మెరుగుపర్చున్నాడు… టీ20 ఫార్మాట్ లో అతడి ర్యాంకు ఆరుకు చేరింది. ఇక టీ20 కెప్టెన్ గా ఇటీవలే టీమిండియా పగ్గాలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్ ఏడు స్థానాలు ఎగబాకి 24వ ర్యాంకు సాధించాడు. మరోవైపు భారత్‌పై అద్భుతంగా బౌలింగ్ చేసిన జింబాబ్వే బౌలర్ బ్లెస్సింగ్ ముజరబానీ 10 స్థానాలు మెరుగుపరుచుకుని టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో 26వ స్థానానికి చేరుకున్నాడు.
గత మూడు టీ20 సిరీస్‌లకు దూరంగా ఉన్న టీమిండియా మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇంకా టాప్ 20లో తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ప్రస్తుతం టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో సూర్య 19వ స్థానంలో ఉన్నాడు. ఇక టీ20 బౌలింగ్ విభాగంలో టాప్ 10లో ఉన్న ఏకైక భారత బౌలర్ వరుణ్ చక్రవర్తి. జింబాబ్వే సిరీస్‌కు దూరమైన అతను మూడు స్థానాలు కోల్పోయి 9వ ర్యాంకుకు పడిపోయాడు. టీ20 ఆల్-రౌండర్ల ర్యాంకింగ్స్‌లో హార్దిక్ పాండ్యా ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు.
34
వన్డే ర్యాంకింగ్స్ లో టాప్ లేపిన టీమిండియా స్టార్స్
ఐసిసి ర్యాంకింగ్స్‌లో భారత వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మళ్లీ టాప్‌లోకి వచ్చేశాడు... వన్డే బ్యాటర్ల జాబితాలో నంబర్ 1 కిరీటాన్ని మళ్లీ దక్కించుకున్నాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో గిల్ 80, 31, 77 పరుగులతో అదరగొట్టి ఈ ర్యాంకు దక్కించుకున్నాడు. ఈ సిరీస్‌ను టీమిండియా కోల్పోయినా గిల్ తన పర్ఫార్మెన్స్‌తో న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్‌ను వెనక్కి నెట్టి నంబర్ 1 అయ్యాడు. వన్డే ర్యాంకింగ్స్‌లో గిల్ టాప్ ర్యాంకు సాధించడం ఇది మూడోసారి అని ఐసీసీ తన ప్రకటనలో తెలిపింది.
ఐసిసి వన్డే ర్యాంకింగ్స్ టాప్ 5 లో ముగ్గురు టీమిండియా స్టార్ ప్లేయర్లే ఉన్నారు. గిల్ 801 రేటింగ్ పాయింట్లతో టాప్ లో ఉంటే విరాట్ కోహ్లీ 767, రోహిత్ శర్మ 758 రేటింగ్ పాయింట్లతో 3, 4 స్థానాల్లో ఉన్నారు. వీరికంటే ముందు 794 రేటింగ్ పాయింట్లతో న్యూజిలాండ్ ప్లేయర్ డారెన్ మిచెల్ రెండో స్థానంలో నిలిచాడు.
టీ20 ర్యాంకింగ్స్ లో 910 రేటింగ్ పాయింట్లతో యువ సంచలనం ఇషాన్ కిషన్ నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. 848 పాయింట్లతో పాక్ ప్లేయర్ షాహిబ్జాదా పర్హాన్ 2వ స్థానంలో నిలిచాడు. అభిషేక్ శర్మ 819 పాయింట్లతో మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
టెస్ట్ బౌలర్లలో జస్ప్రిత్ బుమ్రా 870 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అయితే టాప్ 10 టెస్ట్ బౌలర్లలో బుమ్రా ఒక్కడే ఉన్నాడు.. టాప్ 20 లో 14వ స్థానంలో కుల్దీప్ యాదవ్, 15వ స్థానంలో మహ్మద్ సిరాజ్, 16వ స్థానంలో రవీంద్ర జడేజా ఉన్నారు.
వన్డే ర్యాంకింగ్స్ లో టీమిండిమా పరిస్థితి మరీ దారుణం... ఒక్క బౌలర్ కూడా టాప్ 10 లో లేడు. టాప్ 20 లో కూడా కుల్దీప్ యాదవ్ ఒక్కడే ఉన్నాడు... అతడు 11వ స్థానంలో నిలిచాడు. టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్ లో కూడా ఇదే పరిస్థితి... టాప్ 10 లో వరుణ్ చక్రవర్తి ఒక్కడే ఉన్నాడు. అతడు 663 రేటింగ్ పాయింట్లతో 9వ స్థానంలో నిలిచాడు. టీ20 టాప్ బౌలర్ గా అప్ఘానిస్తాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ నిలిచాడు... అతడు 753 రేటింగ్ పాయింట్లతో టాప్ లో ఉన్నాడు.