Vaibhav Sooryavanshi : ఇషాన్ కెప్టెన్, వైభవ్ వైస్ కెప్టెన్... ఇది కదా టీం అంటే..!

Published : Jul 30, 2026, 10:12 AM IST

కేవలం 15 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అతడి అసాధారణ బ్యాటింగ్ నే కాదు నాయకత్వ లక్షణాలను గుర్తించి సెలక్షన్ కమిటీ ఈ చారిత్రక నిర్ణయం తీసుకుంది.

PREV
14
వైస్ కెప్టెన్ వైభవ్‌ సూర్యవంశీ

వైభవ్ సూర్యవంశీ… ఈ పేరు ఇండియన్ క్రికెట్లో చాలా గట్టిగా వినిపిస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ 15 ఏళ్లు కుర్రాడు అసాధారణ క్రికెట్ ఆడుతున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో టాప్ బౌలర్లను సైతం ఉతికారేస్తూ పరుగుల సునామీ సృష్టిస్తున్నాడు. అతడి ధనాధన్ బ్యాటింగ్ కు క్రికెట్ ప్రియులు కూడా ఫిదా అవుతున్నారు.. దీంతో అతి చిన్న వయసులో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు వైభవ్ అంటే ఓ పేరు కాదు బ్రాండ్… టీమిండియా అద్భుతాలకు కేరాఫ్ అడ్రస్. 

ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన వైభవ్ కు దేశవాళి క్రికెట్లో ప్రమోషన్ లభించింది. త్వరలో జరగబోయే ప్రతిష్ఠాత్మక దులీప్ ట్రోఫీ కోసం ఈస్ట్ జోన్ జట్టును ప్రకటించారు సెలెక్టర్లు… ఎంతోమంది అనుభవజ్ఞులు, రంజీల్లో రాటుదేలిన ఆటగాళ్లు ఉన్న జట్టులో కేవలం 15 ఏళ్ల కుర్రాడికి ‘వైస్ కెప్టెన్’గా కీలక బాధ్యత అప్పగించారు. చిన్న వయసులోనే తన అద్భుత బ్యాటింగ్‌తో సత్తా చాటుతున్న వైభవ్ సూర్యవంశీకి సెలక్షన్ కమిటీ ఈ బంపర్ ప్రమోషన్ ఇచ్చింది. ఇక ఈ టీమ్ కెప్టెన్ గా ఇషాన్ కిషన్ వ్యవహరించనున్నాడు.

24
ఈ అనూహ్య ఎంపికకు కారణమేంటి?

సాధారణంగా దులీప్ ట్రోఫీ లాంటి ఫస్ట్-క్లాస్ టోర్నీల్లో కెప్టెన్సీ, వైస్ కెప్టెన్సీ బాధ్యతలను అనుభవజ్ఞులకే ఇస్తారు. కానీ వైభవ్ సూర్యవంశీ ఇటీవల కనబరుస్తున్న అసాధారణ ఆటతీరు, క్రీడాస్ఫూర్తి, మైదానంలో అతను తీసుకునే నిర్ణయాలు సెలక్టర్లను ఆకట్టుకున్నాయి. కేవలం 15 ఏళ్లకే ఐపిఎల్, ఇంటర్నేషనల్ టీ20 మ్యాచ్‌లలో అంతర్జాతీయ స్థాయి బౌలర్లను ఎదుర్కొన్నాడు వైభవ్… ఇటీవలే జింబాబ్వేతో జరిగిన సిరీస్‌లో 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' గెలిచి తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. దేశవాళి క్రికెట్లోనూ అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. అతడి అసాధారణ ఆటతీరే ఈస్ట్ జోన్ టీమ్ వైస్ కెప్టెన్ గా నిలబెట్టింది.

34
చరిత్ర సృష్టించిన 15 ఏళ్ల సంచలనం

దేశవాళీ క్రికెట్ చరిత్రలో, దులీప్ ట్రోఫీ లాంటి పెద్ద టోర్నీకి ఇంత చిన్న వయసులో వైస్ కెప్టెన్‌గా ఎంపికవ్వడం వైభవ్‌కు దక్కిన అరుదైన రికార్డు. భారత క్రికెట్ కేవలం అనుభవాన్నే కాదు, ప్రతిభ, నాయకత్వ లక్షణాలను కూడా గుర్తిస్తుందని సెలక్షన్ కమిటీ నిర్ణయం నిరూపించింది. ఇప్పుడు ఈ 15 ఏళ్ల కుర్రాడిపై వైస్ కెప్టెన్‌గా జట్టును నడిపించడంతో పాటు, బ్యాటర్‌గా ఈస్ట్ జోన్‌కు పరుగులు సాధించే పెద్ద బాధ్యత ఉంది. వైభవ్ ఎదుగుదల చూసి క్రీడా పండితులు, అభిమానులు ఆశ్చర్యపోతూనే, దులీప్ ట్రోఫీలో అతని ప్రదర్శన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

44
దులీప్ ట్రోఫీకి ఈస్ట్ జోన్ జట్టు

ఇషాన్ కిషన్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ (వైస్ కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్, కుమార్ కుశాగ్రా, విరాట్ సింగ్, అనుకుల్ రాయ్, సుదీప్ ఘరామి, శిఖర్ మోహన్, శుభ్రాంశు సేనాపతి, అభిజిత్ సర్కార్, డానిష్ దాస్, ముహమ్మద్ సుబాజ్ వాల్, షాబాజ్ వాల్ షమీ.

స్టాండ్ బై ఆటగాళ్లు : సాంబిత్ ఎస్ బరాల్, ఆయుష్ లోహరుకా, శరణ్ దీప్ సింగ్, స్వస్తిక్ సమల్.

Read more Photos on
click me!

Recommended Stories