49 కేజీల విభాగంలో స్వర్ణం సాధించిన చైనా వెయిట్ లిఫ్టర్ హూ జీహూయ్, డ్రగ్స్ వాడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు నిర్వహికులు...
స్నాచ్ రౌండ్‌లో అలవోకగా 94 కేజీలు ఎత్తిన హు జీహుయ్, ఆ తర్వాతి రౌండ్‌లో 109, 114, 116 కేజీలను అలవోకగా ఎత్తేసింది. మిగిలిన అథ్లెట్లు స్వల్పంగా ఇబ్బందిపడినట్టు కనిపించినా జీహుయ్ మాత్రం ఎక్కడా అలా అనిపించలేదు...
స్నాచ్‌లో 94, క్లీన్ అండ్ జర్క్ రౌండ్‌లో 116 కేజీలు, మొత్తంగా 210 కేజీలను లిఫ్ట్ చేసి ఒలింపిక్ రికార్డు క్రియేట్ చేసిన హు జీహుయ్‌ను యాంటీ డోపింగ్ అధికారులు పరీక్షించనున్నారు.
ఒకవేళ హుజీహుయ్, నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్టు నిర్ధారణ అయితే, ఆమెపై అనర్హత వేటు పడుతుంది. రెండో స్థానంలో ఉన్న భారత వెయిట్ లిఫ్టర్ మీరాభాయ్ ఛానుకి స్వర్ణం దక్కుతుంది... అదే జరిగితే ఒలింపిక్‌లో స్వర్ణం గెలిచిన మొట్టమొదటి భారత వెయిట్ లిఫ్టర్‌గా చరిత్ర సృష్టిస్తుంది మీరాభాయ్..
మూడో స్థానంలో ఉన్న ఇండోనేషియా వెయిట్ లిఫ్టర్ విండీ కాండీకా అయిషాకు దక్కిన కాంస్య పతకం, రజతంగా మారుతుంది...
పురుషుల వెయిట్ లిఫ్టింగ్‌లో కూడా 61 కేజీలు, 67 కేజీల విభాగాల్లో చైనాకే స్వర్ణ పతకాలు దక్కడం విశేషం. 61 కేజీల విభాగంలో లీ ఫ్యాబిన్, 67 కేజీల విభాగంలో చెన్ లిజున్ పసిడి పతకాలు గెలిచారు.