స్టార్ బౌలర్ లైఫ్ లో సెకండ్ ఇన్నింగ్స్... రెండో భార్యను పరిచయం చేసేసాడుగా..!

Published : Nov 12, 2025, 01:51 PM IST

Cricket : వరల్డ్ క్లాస్ బౌలర్ రషీద్ ఖాన్ జీవితంలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. రెండో పెళ్లి చేసుకున్నట్లు స్వయంగా అతడే సోషల్ మీడియా వేదికన ప్రకటించి రూమర్స్ కి చెక్ పెట్టారు. 

PREV
13
రషీద్ ఖాన్ రెండో పెళ్లి

Rashid Khan : అప్ఘానిస్తాన్ స్టార్ క్రికెటర్ ఇటీవల ఆటతో కంటే ఇతర విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. గతేడాదే రషీద్ కు పెళ్లయ్యింది... కానీ ప్రస్తుతం అతడు మరో యువతితో కలిసి కనిపించడంతో సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. దీనిపై తాజాగా రషీద్ ఖాన్ క్లారిటీ ఇచ్చారు. తాను రెండో పెళ్లి చేసుకున్నానని... ఇటీవల తనతో కనిపించిన మహిళ భార్య అని సోషల్ మీడియాలో ప్రకటించారు.

23
రషీద్ ఖాన్ సెకండ్ మ్యారేజ్

ఈ ఏడాది ఆగస్ట్ 2న రెండో వివాహం చేసుకున్నట్లు అప్ఘాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. తన జీవితంలో మరో అధ్యాయాన్ని కొత్తగా ప్రారంభించాను... తనను ఎంతో ఇష్టపడే మహిళలను పెళ్లాడానని పేర్కొన్నాడు. జీవితంలో శాంతి, నిజమైన బంధాన్ని కోరుకుంటున్నానని అన్నారు.

ఇటీవల తన భార్యను ఓ చారిటీ కార్యక్రమానికి తీసుకెళ్లాను... కానీ దురదృష్టవశాత్తు దీనిపై తప్పుడు ప్రచారం జరుగుతోందని రషీద్ అన్నారు. అయితే దాచిదాడికి ఏమీలేదు... ఆమె తన భార్యే.. ఇదే నిజం అన్నారు. తనను అర్ధం చేసుకుని మద్దతుగా నిలిచే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ రషీద్ ఖాన్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

33
మహిళతో రషీద్ ఖాన్ ఫోటో వైరల్

అప్ఘాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ కు 2024 అక్టోబర్ 24న అంటే సరిగ్గా ఏడాదికింద కుటుంబసభ్యుల సమక్షంలో పెళ్ళయ్యింది. కాబూల్ లో తమ సాంప్రదాయం ప్రకారం రషీద్ తో పాటు మరో ఇద్దరు సోదరులు కూడా పెళ్లిచేసుకున్నారు. ఈ పెళ్లిలో అప్ఘాన్ క్రికెటర్లు సందడి చేశారు.

అయితే తాజాగా రషీద్ మరో మహిళతో కనిపించడం వివాదానికి దారితీసింది. ఏడాదికిందటే పెళ్ళి చేసుకున్న అతడు భార్యతో కాకుండా మరో మహిళతో కనిపించడంతో సోషల్ మీడియాలో చర్చ మొదలయ్యింది. నెదర్లాండ్ లో జరిగిన చారిటీ కార్యక్రమంలో పాల్గొన్న రషీద్ తో పాటు ఆమె ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే తనతో ఉన్నది రెండో భార్య అని రషీద్ క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది.

Read more Photos on
click me!

Recommended Stories