షేక్ చేస్తున్నాడు.. టీ20 క్రికెట్ లో అభిషేక్ శర్మ ప్రపంచ రికార్డు

Published : Nov 08, 2025, 02:39 PM IST

Abhishek Sharma : భారత ఓపెనర్ అభిషేక్ శర్మ బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియాపై 5వ టీ20లో మరో ప్రపంప రికార్డు సాధించాడు. అత్యంత వేగంగా అంటే 528 బంతుల్లో 1000 పరుగులు చేసి తొలి ప్లేయర్ గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

PREV
16
బ్రిస్బేన్‌లో చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ

భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ప్రపంచ క్రికెట్‌లో చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో జరిగిన ఐదవ టీ20 మ్యాచ్‌లో అతను టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో 1000 పరుగుల మైలురాయిని తక్కువ బంతుల్లో పూర్తి చేసి కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

24 ఏళ్ల ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ 528 బంతుల్లోనే 1000 పరుగులు పూర్తి చేశాడు. ఈ రికార్డు ఇంతకుముందు ఆస్ట్రేలియా బ్యాటర్ టిమ్ డేవిడ్ పేరిట ఉండేది. టిమ్ డేవిడ్ 569 బంతుల్లో 1000 పరుగులు సాధించాడు.

26
సూర్యకుమార్, విరాట్‌లను వెనక్కు నెట్టిన అభిషేక్ శర్మ

అభిషేక్ శర్మ ఈ ఘనతను సాధించడం ద్వారా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రికార్డును కూడా అధిగమించాడు. సూర్యకుమార్ 573 బంతుల్లో ఈ మైలురాయిని చేరుకున్నాడు. న్యూజిలాండ్‌కు చెందిన ఫిన్ ఆలెన్ (611 బంతులు) మూడో స్థానంలో ఉన్నాడు.

అభిషేక్ శర్మ 29 మ్యాచ్‌లలో 28 ఇన్నింగ్స్‌ల్లో 1000 పరుగులు పూర్తి చేశాడు. విరాట్ కోహ్లీ 29 మ్యాచ్‌ల్లో 27 ఇన్నింగ్స్‌ల్లో 1000 పరుగులు పూర్తి చేసి వేగవంతమైన భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇప్పుడు అభిషేక్ రెండవ స్థానంలో నిలిచాడు.

36
భారత ఆటగాళ్లలో వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన వారు (ఇన్నింగ్స్ ల పరంగా)
  1. విరాట్ కోహ్లీ – 27 ఇన్నింగ్స్‌లు
  2. అభిషేక్ శర్మ – 28 ఇన్నింగ్స్‌లు
  3. కేఎల్ రాహుల్ – 29 ఇన్నింగ్స్‌లు
  4. సూర్యకుమార్ యాదవ్ – 31 ఇన్నింగ్స్‌లు
  5. రోహిత్ శర్మ – 40 ఇన్నింగ్స్‌లు
46
టీ20లో అత్యల్ప బంతుల్లో 1000 పరుగులు చేసిన ఆటగాళ్లు
  1. అభిషేక్ శర్మ (భారత్) - 528 బంతులు
  2. టిమ్ డేవిడ్ (ఆసీస్)   -  569 బంతులు
  3. సూర్యకుమార్ యాదవ్ (భారత్) – 573 బంతులు
  4. ఫిల్ సాల్ట్ (ఇంగ్లాండ్) - 599 బంతులు
  5. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా) - 604 బంతులు
  6. ఫిన్ ఆలెన్ (న్యూజిలాండ్) - 609 బంతులు
  7. ఆండ్రే రస్సెల్ (వెస్ట్ ఇండీస్) - 609 బంతులు
56
భారత జట్టులో 12వ ఆటగాడిగా 1000 పరుగుల క్లబ్‌లోకి అభిషేక్ ప్రవేశం

అభిషేక్ శర్మ భారత తరఫున 1000 పరుగులు చేసిన 12వ ఆటగాడిగా నిలిచాడు. ఆయన 25 ఏళ్లు 65 రోజుల వయసులో ఈ ఘనత సాధించి, టీ20ల్లో ఈ మైలురాయిని చేరిన అత్యంత పిన్న వయస్కుడైన భారత బ్యాటర్ గా నిలిచాడు.

భారత జట్టులో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లు

  • రోహిత్ శర్మ – 4231 పరుగులు
  • విరాట్ కోహ్లీ – 4188 పరుగులు
  • సూర్యకుమార్ యాదవ్ – 2754 పరుగులు
  • కేఎల్ రాహుల్ – 2265 పరుగులు
  • అభిషేక్ శర్మ – 1000 పరుగులు*
66
ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుత ఫామ్‌లో అభిషేక్

ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో అభిషేక్ శర్మ టీ20 సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ఉన్నాడు. ఇప్పటివరకు 163 పరుగులు చేసి, 40.75 సగటు, 161.38 స్ట్రైక్‌రేట్‌తో దూసుకుపోతున్నాడు.

ఈ మ్యాచ్‌లో 11 బంతులలో రెండు సార్లు క్యాచ్ డ్రాప్ తర్వాత వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాడు. తన ఇన్నింగ్స్‌లో ఆత్మవిశ్వాసం కోల్పోకుండా, గబ్బా ప్రేక్షకుల ముందు చరిత్ర సృష్టించాడు.

Read more Photos on
click me!

Recommended Stories