వేసవిలో చల్లని నీళ్లు తాగాలని అందరూ కోరుకుంటారు. అందుకే చాలా మంది ఫ్రిడ్జ్ లో నీళ్లే తాగుతుంటారు. కాని మట్టికుండలో కూడా నీళ్లు చల్లగా ఉంటాయి. ఆ నీళ్లు తాగితే ఆరోగ్యానికి కూడా మంచిది. ఫ్రిజ్డ్ నీళ్లతో పోలిస్తే మట్టికుండ నీళ్లలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అవి ఆల్కలైన్ వాటర్ లా పనిచేస్తాయి. కాని.. మట్టికుండలో చేయి పెట్టకూడదని పెద్దవాళ్ళు చెబుతారు. దీని వెనుక ఉన్న శాస్త్రీయ, ఆధ్యాత్మిక కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.
మట్టికుండ శుభ్రం చేసేటప్పుడు చేత్తో రుద్దకూడదు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి అపరిశుభ్రత. మన చేతుల్లో చాలా రకాల క్రిములుంటాయి. శుభ్రమైన నీళ్ళలో చేయి పెడితే ఆ క్రిములు మట్టికుండకు అంటుకుంటాయి. దీంతో నీళ్లు పాడయ్యే అవకాశం ఉంటుంది. నీళ్ల రుచి కూడా మారుతుంది.
మట్టికుండ శుభ్రం చేయడానికి చాలా మంది చేయి లేదా స్క్రబ్బర్ వాడుతుంటారు. దీంతో నీళ్ల రుచి పాడవుతుంది. దుర్వాసన వస్తుంది.
మట్టికుండలో చేయి పెట్టి నీళ్లు తీస్తే లేదా శుభ్రం చేస్తే తేమ, వేడి పెరిగి బూజు పట్టే అవకాశం ఉంటుంది.
ఆధ్యాత్మిక కారణాలు
పూర్వకాలంలో మట్టికుండ నీళ్ళను చాలా పవిత్రంగా భావించేవారు. అందులో చేయి పెట్టడం వల్ల అపవిత్రమవుతుందంటారు. అందుకే మట్టి కుండలను మళ్లీ నీళ్లలోనే ముంచి శుభ్రం చేసేవారు.
వాస్తు ప్రకారం ఇంటి వస్తువులను శుభ్రంగా, ఒక వరుస క్రమంలో ఉంచుకుంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నమ్ముతారు. మట్టికుండలో తరచుగా చేయి పెట్టడం వల్ల అపరిశుభ్రంగా మారి పాడైపోతుందని నమ్ముతారు.
మట్టికుండని ఎలా శుభ్రం చేయాలి?
మట్టికుండ బయట భాగాన్ని స్క్రబ్బర్‌తో శుభ్రం చేయవచ్చు. కొంచెం ఉప్పు, బేకింగ్ సోడా వేసి రుద్ది కడిగేయొచ్చు. కాని లోపల శుభ్రం చేయడానికి ఒక చెంచా ఉప్పు వేసి, కొంచెం నీళ్ళు పోసి తిప్పుతూ శుభ్రం చేయాలి. రెండు, మూడు సార్లు శుభ్రమైన నీళ్లతో కడిగితే మట్టికుండ శుభ్రమవుతుంది.
ఇది కూడా చదవండి ఈ సింపుల్ టిప్స్‌తో సాలె పురుగులు మళ్లీ ఇంట్లోకి రావు