Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ 8 ఫాలో అయితే మిమ్మల్ని ఎవరూ ఓడించలేరు!

Published : Apr 21, 2025, 02:04 PM IST

జీవితంలో గెలుపు, ఓటములు సహజం. కానీ గెలవాలనే కోరిక ఉన్నంతమాత్రాన గెలుపు దక్కదు. అందుకు తగ్గ శ్రమ, కొన్ని మంచి అలవాట్లు ఉన్నప్పుడే విజయం వరిస్తుంది. చాణక్య నీతి ప్రకారం జీవితంలో విజయం సాధించడానికి కొన్ని విషయాలను కచ్చితంగా ఫాలో కావాలి. అవెంటో ఇక్కడ తెలుసుకుందాం.

PREV
19
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ 8 ఫాలో అయితే మిమ్మల్ని ఎవరూ ఓడించలేరు!

ఆచార్య చాణక్యుడి గురించి తెలియని వారుండరు. ఆయన నీతి సూత్రాలు ఇప్పటికీ చాలామంది ఫాలో అవుతుంటారు. చాణక్యుడు మానవ జీవితాలకు సంబంధించిన ఎన్నో విషయాలు చెప్పాడు. ఒక వ్యక్తి ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? మిత్రులెవరు? శత్రువులెవరు? ఎలాంటి గుణాలు విజయానికి చేరువ చేస్తాయి.. లాంటి ఎన్నో విషయాలు తన బోధనల్లో వివరించాడు. చాణక్యుడి ప్రకారం జీవితంలో విజయం సాధించాలంటే కొన్ని అలవాట్లు పెంపొందించుకోవాలి. మరికొన్ని మార్చుకోవాలి. అవెంటో ఇక్కడ చూద్దాం.

29
కష్టపడే తత్వం

కష్టపడి పనిచేసే తత్వం ఎవరినైనా ఏదో ఒకరోజు గొప్పవారిని చేస్తుంది. చాణక్య నీతి ప్రకారం జీవితంలో విజయం సాధించడానికి కష్టపడి పని చేయడంతోపాటు నిబద్ధత కూడా అవసరం.

39
ప్రతికూల ఆలోచనలు వద్దు

చాణక్య నీతి ప్రకారం ప్రతికూల ఆలోచనలు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. విజయం సాధించాలంటే ప్రతికూల ఆలోచనలను దూరం పెట్టాలి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి.

49
సోమరితనం పనికిరాదు

చాణక్య నీతి ప్రకారం జీవితంలో విజయం సాధించాలంటే సోమరితనాన్ని వదిలించుకోవాలి. సోమరితనం ఉన్నవారు ఎప్పుడూ విజయం సాధించలేరు.

59
అభద్రతా భావం వద్దు

చాణక్య నీతి ప్రకారం అభద్రతా భావం ఉంటే కొత్త అవకాశాలను స్వీకరించలేరు. ఎప్పుడూ అభద్రతా భావంతో ఉండేవారు విజయం సాధించడం కష్టమని చాణక్య నీతి చెబుతోంది.

69
లోభం పనికిరాదు

చాణక్య నీతి ప్రకారం లోభం మనిషిని చెడు మార్గంలో నడిపిస్తుంది. తప్పులు చేసేలా చేస్తుంది. వ్యక్తులు లోభిస్తే విజయం సాధించలేరని చాణక్యడు తన నీతిసూత్రాల్లో బోధించాడు.

79
కోపం వద్దు!

చాణక్య నీతి ప్రకారం కోపం మనిషిని తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. కాబట్టి కోపాన్ని తగ్గించుకోవడం మంచిది. కోపం ఎప్పుడూ విజయాన్ని దూరం చేస్తుందని చాణక్యుడి బోధనలు చెబుతున్నాయి.

89
అహంకారం వద్దు

చాణక్య నీతి ప్రకారం ఎవరికైనా అహంకారం ఉంటే ఇతరుల నుంచి ఏమీ నేర్చుకోలేరు. విజయం సాధించాలంటే ముందుగా అహంకారాన్ని వదిలించుకోవాలని చాణక్య నీతి చెబుతోంది.

99
ఓపిక

చాణక్య నీతి ప్రకారం జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఓపికగా ఉండాలి. ఆత్మవిశ్వాసంతో అన్ని పరిస్థితులను ఎదుర్కోవాలి. అప్పుడు విజయం మన సొంతం అవుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories