మీ పెళ్లి సంతోషంగా, ఉత్సాహంగా కాకుండా.. లేకుండా ఏవైనా గొడవలు, తగాదాలు ఏదైనా గందరగోళం లాంటివి జరిగితే... మీ వైవాహిక జీవితం సమస్యల్లో చిక్కుకోవచ్చని అర్థం.అదేవిధంగా, మీకు వివాహం ఆగిపోయినట్లు ఏవైనా కళలలు వస్తే.. మీ జీవితంలో మీరు అనుకున్న అన్ని పనులు సవ్యంగా జరగవని, ఆటంకాలు వచ్చి ఆగిపోయే అవకాశం ఉందని అర్థం. అలా కాకుండా, మీరు నల్లటి దుస్తులలో పెళ్లి చేసుకున్నట్లు కల వస్తే... మీ కుటుంబంలో ఏదో దుఖం లేదా, నష్టం జరిగే అవకాశం ఉందని అర్థం.
గ్రహాల ప్రభావం:
జ్యోతిషశాస్త్రంలో, శుక్రుడు ప్రేమ , వివాహాన్ని నియంత్రిస్తాడు. కలలో వివాహం శుక్రుడిచే ప్రభావితమవుతుంది. మీ జాతకంలో శుక్రుడు బలంగా ఉంటే, ఆ కల అదృష్టాన్ని తెస్తుంది. శుక్రుడు బలహీనంగా ఉంటే, మీరు మీ సంబంధాలలో జాగ్రత్తగా ఉండాలి.