Chanakya Niti: కోట్లు సంపాదించడం కాదు.. ఈ అలవాట్లు ఉంటేనే డబ్బు నిలుస్తుంది..!

Published : Apr 04, 2026, 11:45 AM IST

Chanakya Niti: డబ్బు అనేది జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. నేటి కాలంలో డబ్బు లేకుండా ఏ పనీ సాధ్యం కాదు. చాణక్య నీతి ప్రకారం ఒక వ్యక్తిలోని కొన్ని అలవాట్లు అతన్ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టివేస్తాయి.  

PREV
14
Chanakya Niti

ప్రతి వ్యక్తీ తన జీవితంలో ఏదో ఒక దశలో డబ్బు సమస్యలను గానీ, ఆర్థిక లేమిని గానీ ఎదుర్కునే ఉంటాడు. లేదా, చాలా మంది తమ ఆదాయం, ఖర్చుల మధ్య సరైన సమతుల్యతను పాటించలేకపోవడం వల్ల ఆర్థిక సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా కొన్ని అలవాట్లు నేర్చుకోకపోతే... ఆర్థికంగా చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. మరి, చాణక్య నీతి ప్రకారం ఆదాయం పెరగాలన్నా, ఆర్థిక సమస్యలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

24
1.ధనాన్ని గౌరవించడం...

డబ్బు సంపాదించినా, సంపాదించకపోయినా.. దానిని గౌరవించడం చాలా ముఖ్యం అని చాణక్యుడు చెబుతున్నాడు. సంపదను గౌరవంతో చేసే వ్యక్తి వద్ద ఎల్లప్పుడూ ధనం నిలిచి ఉంటుంది. ధనాన్ని విపరీతంగా దుబారాగా, అజాగ్రత్తగా ఖర్చు చేసే వ్యక్తి వద్ద ఎటువంటి ధనమూ, సంపదా నిలవదు. ధనాన్ని సరిగ్గా ప్రణాళిక చేసుకొని, తెలివిగా ఖర్చు చేయడం చాలా ముఖ్యం.

2.పాజిటివ్ థింకింగ్...

ఆర్థిక సమస్యల నుండి బయటపడటానికి, ధన సంబంధిత ఇబ్బందులను ఎదుర్కోవడానికి సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండటం చాలా ముఖ్యం. మనలో ఉండే ప్రతికూల ఆలోచనలు, భావాలు ఎల్లప్పుడూ మన పురోగతికి ఆటంకం కలిగిస్తాయి. సమస్యలు సృష్టిస్తాయి. పాజిటివ్ ఆలోచనలకు బదులుగా నెగిటివ్ ఆలోచనలు ఎక్కువగా ఉన్న వారికి విజయావకాశాలు తక్కువగా ఉంటాయి.

34
3.ఆదాయ వనరులను సృష్టించుకోవడం...

మీకు ఇప్పటికే ఆదాయ వనరులు ఉండవచ్చు. అయితే, కేవలం ఒకే ఒక్క ఆదాయ వనరుపై ఆధారపడటం మీకు శ్రేయస్కరం కాదు. ఆర్థిక సమస్యలు తలెత్తినప్పుడు లేదా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పుడు, వివిధ ఆదాయ వనరులు మనకు అండగా నిలుస్తాయి. ఈ కారణంగానే, మనం కొత్త ఆదాయ వనరులను సృష్టించుకోవాలని , మన ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను నేర్చుకోవాలని చాణక్యుడు సూచించారు.

సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం

ఆచార్యుని అభిప్రాయం ప్రకారం, ఒక వ్యక్తికి ధనం మాత్రమే కాదు, సమయం కూడా అంతే ముఖ్యం. సమయం , ధనం అనేవి ఒకే నాణేనికి ఉన్న రెండు ముఖాల వంటివి. రెండింటికీ సమానమైన విలువ ఉంటుంది. సమయాన్ని వృథా చేసేవారి దగ్గర కూడా డబ్బు నిలవదు.

44
చిన్న ఖర్చులపై దృష్టి సారించడం

సాధారణంగా ప్రజలు కేవలం పెద్ద ఖర్చులను మాత్రమే లెక్కించుకుంటారు. వారు చిన్న చిన్న ఖర్చులను విస్మరిస్తారు. అయితే, ఈ చిన్న ఖర్చులే ఒకనాటికి పెద్ద ఆర్థిక సమస్యలకు దారితీయవచ్చన్న విషయాన్ని వారు మర్చిపోతారు. అనవసరమైన ఖర్చులను నియంత్రించడానికి, ప్రతి చిన్న ఖర్చును అదుపులో ఉంచుకోవడం మనకు ఎంతో శ్రేయస్కరం.

పొదుపు

పొదుపు చేయడం చాలా ముఖ్యమని ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో పేర్కొన్నారు. మనకు సాధ్యమైనంత వరకు పొదుపు చేయడం ఒక గొప్ప సద్గుణమని చాణక్యుడు వివరించారు. ప్రతి వ్యక్తి తన ఆదాయంలో కొంత భాగాన్ని భవిష్యత్తు కోసం లేదా తన రాబోయే జీవితం కోసం భద్రంగా దాచుకోవాలని చాణక్యుడు సూచించారు. భవిష్యత్తులో మనం ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నప్పుడు, ఈ పొదుపే మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories