ఊరంతా తిరిగి ఇంటికి వచ్చాక..అమ్మో, నాన్నమ్మో దిష్టి తీస్తారు. దానికి కచ్చితంగా ఉప్పు, మిరపకాయలు పట్టుకుని మూడు సార్లు తిప్పి దిష్టి తీసి వాటిని బయటపడేస్తారు. ఇది మూఢనమ్మకమా? తరతరాలుగా వస్తున్న ఈ ఆచారం వెనుక ఓ సీక్రెట్ ఉంది.
ఒక వ్యక్తికి ఉన్నట్టుండి నీరసం, మానసిక అశాంతి, ఇంట్లో వరుసగా సమస్యలు లేదా ఏ పనిలోనైనా ఆటంకాలు ఎదురైనప్పుడు, 'దిష్టి తగిలింది' అని చాలామంది నమ్ముతారు. ముఖ్యంగా భారతీయులు…దిష్టి పోవాలని ఉప్పు, మిరపకాయలు వాడుతారు. అయితే, ఈ ఆచారం వెనుక ఉన్న ఆధ్యాత్మిక కారణాలు ఏంటి? ప్రత్యేకంగా ఉప్పు, మిరపకాయలనే ఎందుకు వాడతారు? చాలామందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం.
మామూలుగా ఉప్పును కేవలం వంటల్లో వాడుతారు. అయితే ఇది నెగటివ్ ఎనర్జీని ఆకర్షించి, గ్రహించే గుణం కలిగి ఉంటుందని భావిస్తారు. అందుకే ఇంట్లో ఉండే నెగటివ్ శక్తులను ఉప్పు గ్రహిస్తుందని నమ్ముతారు. మానసిక ఒత్తిడి, చెడు వైబ్రేషన్స్‌ను తొలగించడంలో ఇది సహాయపడుతుందని చాలామంది భావిస్తారు. వాస్తు, పరిహార పద్ధతుల్లో ఉప్పుకు ముఖ్యమైన స్థానం ఉంది. కొందరు ఇంటి మూలల్లో ఉప్పు పెట్టి నెగటివ్ ఎనర్జీని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తారు. అందుకే, దిష్టి తీసేటప్పుడు చేతిలో ఉప్పు పట్టుకుని తిప్పే అలవాటు వచ్చిందని చెబుతారు.