ఆషాఢ మాసానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నెలలో పెళ్లిళ్లు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు జరగవు కాబట్టి దీనిని కొందరు "శూన్య మాసం" అని పిలుస్తారు. కానీ కొన్ని ఉత్సవాలు, పండుగలతో సందడిగా ఉంటుంది. ప్రకృతిలో మార్పులతో పాటు భక్తిభావం వెల్లివిరిసే ఈ ఆషాఢ మాసంలో జరుపుకునే ప్రధాన పండుగలు, విశేషాలు ఇవే
తెలంగాణ బోనాలు (ఆషాఢ బోనాలు)
తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఆషాఢ మాసం అంటేనే బోనాల జాతర. గోల్కొండ జగదాంబిక అమ్మవారి పూజతో ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమవుతాయి. లష్కర్ బోనాలు (సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి), పాతబస్తీ భాగ్యలక్ష్మి అమ్మవార్లకు భక్తులు నైవేద్యం (బోనం) సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు.