మిరియాలను మనం రెగ్యులర్ గా వంటలో వాడుతూ ఉంటాం. చాలా తక్కువ పరిమాణంలో వీటిని వాడుతూ ఉంటారు. ఆయుర్వేదం ప్రకారం..మిరియాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.జలుబు, గొంతు నొప్పి లాంటివాటి నుంచి ఉపశమనం కలిగించడంలోనూ ఇవి మనకు సహాయపడతాయి. చాలా మంది జలుబు చేయగానే.. ఇంట్లోనే మిరియాలతో రసం తయారు చేసుకొని మరీ తింటారు. మరి.. ఈ మిరియాలతో మనకు వచ్చే చాలా సమస్యలను పరిష్కరించవచ్చు అని మీకు తెలుసా?
జోతిష్యశాస్త్రం ప్రకారం, మిరియాలు గ్రహాలతో ముడిపడి ఉంటాయి. ఇంట్లో మిరియాలు ఉంచుకోవడం వల్ల కొన్ని రకాల గ్రహాల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా.. ఈ మిరియాలను ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు దిండు కింద పెట్టుకుంటే చాలా రకాల సమస్యల నుంచి బయటపడొచ్చని మీకు తెలుసా? అవేంటో చూద్దాం...
24
ప్రతికూల శక్తిని తొలగించడానికి మిరియాలు
మీరు దిండు కింద మిరియాలు పెట్టుకుని నిద్రపోతే, మిరియాల శక్తి రాత్రిపూట మీ నిద్రకు భంగం కలిగించే ప్రతికూల శక్తిని , చెడు ఆలోచనలను తొలగిస్తుందని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. దిష్టి తగలడం లాంటి సమస్య కూడా ఉండదు.
పేదరికాన్ని అధిగమించడానికి మిరియాలు
కుటుంబంలో అప్పుడప్పుడు ఆర్థిక సమస్య ఉంటే, దాన్ని పరిష్కరించవచ్చు. మీరు తరచుగా ఆర్థిక సంక్షోభంలో ఉంటే, కోలుకోవడం కష్టంగా ఉందని అనిపించినప్పుడు ఈ మిరియాలను వాడితే సరిపోతుంది. అప్పు, ఆర్థిక పరిస్థితి లేదా ఇంట్లో నిరంతరం డబ్బు కొరత ఉంటే, మీ దిండు కింద మిరియాలు పెట్టుకుని నిద్రపోండి. ఇది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపడుతుంది.
34
విజయాన్ని తెచ్చే మిరియాలు..
చాలా మంది జీవితంలో తాము ఎంత కష్టపడినా విజయం సాధించలేకపోతున్నాం అని ఫీలౌతూ ఉంటారు. అలాంటివారు మిరియాలు వాడితే చాలు. చదువులో, ఉద్యోగంలో ఎందులో సక్సెస్ రావడం లేదని భావించినా కూడా మిరియాలు వాడాలి. దీని కోసం, మన మీరు దిండు కింద మిరియాలు పెట్టుకుని నిద్రపోవడం వల్ల ఈ సమస్యల నుంచి బయటపడతారు. అదృష్టం పెరుగుతుంది. లక్ష్యాలను సాధించగలరు.
ఒక పని ముందు మనం చాలాసార్లు ఆలోచిస్తాము. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు.. భయం , ఆందోళన మనపై ప్రభావం చూపుతాయి. అదేవిధంగా, నిద్రపోతున్నప్పుడు, ఆ చర్య గురించి మనకు చెడు కలలు రావచ్చు. మిరియాలు శనిదేవుడితో సంబంధం కలిగి ఉంటాయి. కాబట్టి, మీరు శనిదేవుని ఆశీస్సులు పొందితే, మీరు మనశ్శాంతిని పొందవచ్చు.