జ్యోతిష్య ప్రకారం, రాఖీ శుభ ముహూర్తంలోనే కట్టడం ఎంతో ముఖ్యమైనది. ముఖ్యంగా తూర్పు దిశలో ముఖం ఉంచి రాఖీ కడితే శుభ ఫలితాలుంటాయని నమ్ముతారు. అలాగే రాఖీ కట్టిన తర్వాత హారతి ఇవ్వడం వల్ల దురదృష్టం తొలగి, శుభశక్తులు వస్తాయని భావన.
తల్లిదండ్రుల పాత్ర:
ఈ సందర్భంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు రాఖీ వెనక ఉన్న సంస్కృతి, ఆధ్యాత్మికతను వివరించడం ఎంతో అవసరం. కేవలం గిఫ్ట్‌లు ఇవ్వడం కన్నా, కుటుంబ బంధాలను ముడిపెట్టే సంప్రదాయాన్ని మనవరకు మిగల్చే బాధ్యత తల్లిదండ్రులదే.
ఫైనల్ గా...
వెండి, బంగారు రాఖీలు కేవలం అలంకారాలే కాదు. అవి ఒక భావోద్వేగానికి, అనుబంధానికి, భద్రతకు ప్రతీకలు. ఈ రాఖీ పండుగను, మీ సోదరుడితో ఆత్మీయంగా జరుపుకోండి.