ఆధ్యాత్మిక పరంగా.. తలలో పూలు పెట్టుకోవడం వల్ల మహాలక్ష్మి దేవి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. ఈ ఆచారం ఇంట్లో ఐశ్వర్యం, సమృద్ధి, శుభశక్తుల ప్రసరణకు దోహదపడుతుంది. అయితే, “భర్త చనిపోయాక స్త్రీలు పూలు పెట్టుకోవచ్చా?” అనే సందేహం చాలామంది ఉంది.
ఈ ప్రశ్నకు దేశమంగైయర్ కరసి అనే ఒక ఆధ్యాత్మిక ప్రచారకురాలు చక్కటి వివరణ ఇచ్చారు. ఆమె అభిప్రాయం ప్రకారం.. ఈ వాదన పూర్తిగా తప్పు. పూలు మహిళకు పుట్టుకతోనే సంక్రమిస్తాయి, అవి ఆమె వ్యక్తిత్వానికి, ఆనందానికి, ఆత్మవిశ్వాసానికి గుర్తుగా ఉంటాయి.
భర్త లేని మహిళలు పూలు పెట్టుకోవద్దని, బొట్టు పెట్టుకోవద్దని చెప్పడం ఒక సాంఘిక నిర్మితి మాత్రమేనని, అది మహిళలను ఒంటరితనంలోకి నెట్టే ఆచారమని ఆమె అన్నారు. నిజానికి, ప్రతి మహిళ జీవితంలోని ఏ దశలోనైనా పూలు ధరించవచ్చు, అది ఆమె హక్కు, ఆనందం, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని వివరించారు.