Shivratri: మహా శివరాత్రి రోజున శివయ్య పూజలో వీటిని మాత్రం వాడకూడదు, ఎందుకో తెలుసా?

Published : Feb 11, 2026, 02:25 PM IST

Shivratri: మహా శివరాత్రి వచ్చేస్తోంది. శివ భక్తులకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ పరమశివుని అనుగ్రహం పొందడానికి భక్తులు ఆయనకు పూజలు చేస్తూ ఉంటారు. అయితే.. శివయ్యకు పూజ చేసే సమయంలో పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు.

PREV
13
మహాశివరాత్రి...

శాస్త్రాల ప్రకారం, శివ పూజలో కొన్ని వస్తువులను వాడకూడదు.మరి, వేటికి దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం...

1.మొగలి పువ్వు...

పురాణాల ప్రకారం, బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పినప్పుడు అతనికి మొగలి పువ్వు సహకరించిందంట. అందుకే, శివుడు మొగలి పువ్వును శివుడు శపించారు. అందుకే.. అప్పటి నుంచి శివుని పూజలో ఈ పువ్వును వాడటం మానేశారు.

23
ఇవి కూడా పూజకి వాడకూడదు..

2. పసుపు...

సాధారణంగా అన్ని దైవ కార్యాల్లో పసుపు వాడతాము, కానీ శివలింగానికి నేరుగా పసుపు పూయడం ఆచారం కాదు. శివుడు వైరాగ్యానికి చిహ్నం, పసుపు సౌభాగ్యానికి చిహ్నం. అందుకే లింగంపై కాకుండా, కేవలం పానవట్టం మీద మాత్రమే పసుపును ఉపయోగించాలి.

3. తులసి దళాలు ...

తులసికి విష్ణువు అంటే ప్రీతి, కానీ శివుని విషయానికి వస్తే ఇది నిషిద్ధం. జలంధరుడనే రాక్షసుడిని శివుడు సంహరించిన కారణంగా, అతని భార్య అయిన తులసి శివపూజలో తన ఉనికిని నిరాకరించింది. అందుకే శివలింగంపై తులసి దళాలు వేయకూడదు, అలాగే శివపూజ చేసేటప్పుడు తులసి మాల ధరించకపోవడం ఉత్తమం.

4. కొబ్బరి నీళ్ల అభిషేకం...

శివునికి కొబ్బరిని సమర్పించవచ్చు కానీ, కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయడం శాస్త్ర విరుద్ధం. ముఖ్యంగా పీచు తీసిన కొబ్బరిని కొట్టిన తర్వాత, ఆ నీటిని లింగంపై పోయకూడదు. శివునికి కేవలం పాలు, పెరుగు, తేనె లేదా గంగాజలంతో అభిషేకం చేయడం శ్రేష్ఠం.

5. కుంకుమ

కుంకుమ సౌభాగ్యానికి , అలంకారానికి ప్రతీక. శివుడు భస్మధారి, వైరాగ్య మూర్తి. కాబట్టి శివలింగంపై కుంకుమను వాడకూడదు. దానికి బదులుగా విభూతి (Bhasma) పూయడం శివుడికి అత్యంత ప్రీతికరమైనది. విభూతి ధారణ వల్ల పాపాలు నశిస్తాయని భక్తుల నమ్మకం.

33
శివుని పూజకు వాడాల్సింది ఇదే..

శివుడికి అత్యంత ప్రీతికరమైనది బిల్వ పత్రం. దీనినే మారేడు ఆకు అని కూడా పిలుస్తారు. "త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం" అన్నట్లుగా.. మూడు ఆకులు కలిసి ఉన్న బిల్వ దళంతో శివుడిని పూజిస్తే కోటి జన్మల పాపాలు తొలగిపోతాయి. శివరాత్రి రోజు ఒక్క మారేడు ఆకును భక్తితో సమర్పించినా శివుడు సంతోషిస్తాడు.

"ఓం నమః శివాయ" మంత్రాన్ని జపిస్తూ భక్తితో చేసే పూజ ఏ దోషాలు అయినా తొలగిపోతాయి.

Read more Photos on
click me!

Recommended Stories