విశాఖ నక్షత్రంలో జన్మించిన వారికి ఇది కష్టకాలమే. రాహువు, శనిల దుష్ప్రభావం వీరిపై అత్యధికంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులతోపాటు ఇతర కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఊహించని ఆర్థిక ఖర్చులు ఏర్పడతాయి. సమయానికి చేతికి డబ్బు అందదు. అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. దగ్గరి వాళ్లతోనే గొడవలు జరిగే అవకాశం ఉంది. చాలా ఓర్పుగా ఉండాల్సిన సమయం ఇది. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి.