మరికొద్ది సేపట్లో రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం మొదలుకానుంది. ఈ పవిత్రమైన కార్యక్రమానికి ఎంతో మంది ప్రముఖులు హాజరుకానున్నారు. అయితే అయోధ్యకు వెళ్లలేని వారు ఇంట్లోనే రాముడి అనుగ్రహం పొందొచ్చు. ఇందుకోసం ఈ రోజు శ్రీరాముడిని ప్రత్యేకంగా పూజించాల్సి ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
సుముహూర్తం
ఈ రోజు మధ్యాహ్నం 12.20 గంటల నుంచి 12.45 గంటల మధ్య అయోధ్యలోప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగునుంది. అంతేకాదు ఈ సమయంలో మనం ఇంట్లో శ్రీరాముడిని పూజించొచ్చు. శ్రీరాముడి ఆశీస్సులు, అనుగ్రహం పొందడానికి ఆయనను ఎలా పూజించాలో, ఎలాంటి నియమాలాను పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
పూజా నియమాలు
ఈ రోజు మీ ఇంటిని, ఇంట్లోని దేవుడి ఆలయాన్ని లేదా పూజా స్థలాన్ని శుభ్రం చేసి పూలతో అలంకరించాలి.
పూజా మందిరం దగ్గర రంగులతో డిజైన్ వేయండి.
అలాగే పూజ చేయడాని ముందు స్నానం చేసి శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి.
అలాగే చందనం ఉన్న తిలకాన్ని నుదుటికి పెట్టుకోండి.
ఈ పవిత్రమైన రోజున మీరు లేత రంగు, కొత్త బట్టలను వేసుకోండి.
తర్వాత రాములోరి విగ్రహానికి తేనె, పాలు, తేనె వంటి పవిత్రమైన వాటితో అభిషేకించండి.
అలాగే రాముడి విగ్రహానికి ఉత్సవ స్నానం అందించండి.
దేవుడి గుడి ప్రవేశం వద్ద స్వస్తిక్, ఓంను గీయండి. వీటిని శుభానికి, దైవ సన్నిధికి ప్రతీకగా భావిస్తారు.
శ్రేయస్సు, సమృద్ధి కోసం గుప్పెడు బియ్యాన్ని పూజ దగ్గర పెట్టండి.
అలాగే కలశాన్ని తీసుకుని పసుపు, కుంకుమలతో అలంకరించండి. దీంతో మీకు దైవానుగ్రహం లభిస్తుంది.
అలాగే కొబ్బరి, తాజా పండ్లతో అలంకరించండి.
మధ్యలో శ్రీరాముడి విగ్రహాన్ని ఉంచండి. అలాగే బాల రాముడి విగ్రహాన్ని కూడా పెట్టండి.
స్వచ్ఛత, దైవప్రేమ కోసం బంతిపూలు, మల్లెపూలను చల్లండి.
'ఓం రామాయ నమః' అనే రామ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే శ్రీరాముడి అనుగ్రహం మీపై ఉంటుంది.