ప్రాణ ప్రతిష్ఠ సమయంలో ఈ పని మాత్రం చేయకండి.. లేదంటే పూజా ఫలం కూడా దక్కదు

First Published Jan 22, 2024, 10:02 AM IST

లోకం మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అద్బుతమైన ఘట్టం ఈ రోజే జరుగనుంది. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం.. ప్రాణ ప్రతిష్ట సమయంలో కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి. లేదంటే మీరు పూజ చేసినా ఫలితం కూడా దక్కదు. 
 

ఈ రోజే అయోద్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట జరుగనుంది. ఈ రోజు కోసం లోకం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. రామ మందిర ప్రతిష్ఠపై దేశవిదేశాల్లో ఎంతో ఉత్సాహం కనిపిస్తోంది. ప్రతిష్ఠాపన సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ అద్బుతమైన ఘట్టం కోసం గత కొన్ని నెలలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి కూడా. ఈ రోజు మీరు కూడా మీ ఇంట్లో శ్రీరాముడికి పూజ చేస్తుంటే.. ప్రతిష్ఠను నిర్వహించే ముందు దానికి సంబంధించిన నియమాల గురించి మీరు ఖచ్చతంగా తెలుసుకోవాలి. ప్రతిష్ఠ సమయంలో కొన్ని తప్పులు చేయడం వల్ల శ్రీరాముడికి కోపం వస్తుందని, దీనివల్ల మీరు పూజ చేసినా ఫలితం దక్కదని పండితులు చెప్తున్నారు. శ్రీరాముడి పూజ చేసేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదో తెలుసుకుందాం పదండి.
 

ram mandir ayodhya

ప్రాణ ప్రతిష్ఠ నియమాలు

1. మీ  ఇంట్లో శ్రీరాముని విగ్రహం పెట్టాలనుకుంటే  మీ ఇంటి ఆలయం సరైన దిశలో ఉండాలి. ఇంట్లో ఈశాన్య దిశలో రాముని పూజ చేయడం శుభప్రదమని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ దిశలో తప్ప మరే దిక్కులోనూ పూజలు చేయకూడదు. ఈ దిశలో కాకుండా మీరు వేరే దిశలో పూజ చేసినా ఫలితం మాత్రం ఉండదు. 
 

ram mandir ayodhya

2. రామ్ లల్లా ప్రతిష్ఠ రోజున పొరపాటున కూడా మీరు మద్యం, మాంసాహారం జోలికి వెళ్లకూడదు. ఎలాంటి మత్తు పదార్థాలను తీసుకోవద్దు. ఇలా చేయడం వల్ల ఇంటికి నెగెటివ్ ఎనర్జీ వస్తుందని పండితులు చెబుతున్నారు.
 

3. మీరు ఈ రోజున ఇంట్లో  శ్రీరాముని విగ్రహం పెడుతున్నట్టైతే ఈ రోజున ఇంటిని శుభ్రం చేయడంలో ప్రత్యేక శ్రద్ధ వహించండి. పూజకు ముందు దేవుళ్లు, దేవతల విగ్రహాలను నీళ్లు, గంగా నీటితో శుభ్రం చేయండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది.
 

Ayodhya Ram Temple-Date of Ram Lalla Pran Prathistha Announced

4. ఈ రోజును దీపావళిలా జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. అందుకే ఈ రోజు ఇంటి ఆలయంలో దీపాలను వెలిగించండి. దీనివల్ల మీ ఇంట్లో సుఖ సంతోషాలు, శాంతి వెల్లివిరుస్తాయి. 

click me!