అయోధ్య నుంచి ఇంటికి వచ్చిన అక్షింతలను ఏం చేస్తున్నారు?

First Published Jan 22, 2024, 10:40 AM IST

ఈ పాటికే దేశంలోని ప్రతి ఇంటికీ అయోధ్య రామ మందిరం నుంచి అక్షింతలు చేరే ఉంటాయి. ఈ అక్షింతలను మనం ఎంతో పవిత్రంగా భావించాలి. ఇవి సంపద, వైభవం, లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావిస్తారు. అంతేకాదు ఈ అక్షింతలు ఆ రామయ్య అనుగ్రహాన్ని మనకు కలిగిస్తాయని నమ్ముతారు. అందుకే అయోధ్య రామ మందిరం నుంచి మన ఇంటికి వచ్చిన అక్షింతలతో ఏం చేయాలో తెలుసుకుందాం.. 
 

అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ మరికొద్ది సేపట్లో ఈ అద్బుతమైన ఘట్టం జరుగనుంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎంతో మతపరమైన ప్రాముఖ్యతను కలిగిన ఈ కార్యక్రమంలో ఎన్నో ముఖ్యమైన భారతీయ సంప్రదాయాలను పాటిస్తున్నారు. కాగా ప్రాణ ప్రతిష్టకు సంప్రదాయబద్ధంగా పసుపు అక్షింతలతో దేశవ్యాప్తంగా ఆహ్వానాలు పంపారు. దేశం అంతటా ప్రతి గడపకు అయోధ్య నుంచి అక్షింతలు చేరే ఉంటాయి. ఈ అక్షింతలను చారిత్రాత్మకంగా పండుగలు లేదా ఏదైనా శుభకార్యాలకు ఆహ్వానించడానికి ఉపయోగిస్తారు.
 

పసుపు అక్షతల మతపరమైన ప్రాముఖ్యత

జ్యోతిషశాస్త్రం ప్రకారం.. బియ్యాన్ని శుక్ర గ్రహానికి చిహ్నంగా భావిస్తారు. ఇది సంపద, కీర్తి, లక్ష్మి, భౌతిక సౌకర్యాలతో ముడిపడి ఉంటుంది. ఈ అక్షింతలను ఎర్రని పట్టు వస్త్రంలో కట్టి భద్రంగా పెడితే.. లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చే మార్గం తెరుచుకుంటుందని నమ్ముతారు. అలాగే అమ్మవారి ఆశీస్సులు జీవితాంతం మనకు ఉంటాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాదు ఈ అక్షింతలు మన ఇంట్లో ఉన్నంత కాలం ఇంట్లోని అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. జీవితం ఆనందంగా సాగుతుంది.

Ayodhya Ram Mandir

అక్షింతలను ఎక్కడ ఉపయోగించాలి? 

ఈ పసుపు బియ్యాన్ని మీరు ఎలాంటి శుభకార్యాల్లో అయినా ఉపయోగించొచ్చు.

అలాగే వీటితో నైవేద్యం తయారుచేసి ప్రసాదంగా ఇంటిళ్లి పాది తినొచ్చు. 

ఈ అక్షింతలను మీరు తిలకంగా కూడా వాడుకోవచ్చు. 

అక్షతలను సురక్షితంగా ఉంచితే మీ ఇంట్లో సంతోషం, శాంతి నెలకొంటాయి.

అక్షింతలను పర్సులో భద్రపరుచుకోవడం వల్ల మీ జీవితంలో డబ్బుకు ఎలాంటి కొదవా ఉండదు. 

click me!