Marakata Shiva Lingam: హైదరాబాద్‌కు సమీపంలోని చందిప్ప మరకత సోమేశ్వర స్వామి ఆలయం చాలా ప్రత్యేకం. 1000 ఏళ్ల నాటి చరిత్ర, ఆరోగ్య ప్రసాదిత మరకత లింగం మహిమల గురించిన పూర్తి వివరాలు మీకోసం.
గ్రహదోషాలా? హెల్త్ ప్రాబ్లమ్స్ ఆ? శంకర్ పల్లి రూట్ లో ఉన్న ఈ గుడికి వెళ్తే చాలు.. అంతా సెట్!
తెలంగాణలో ఎన్నో అద్భుతమైన, మిస్టరీలతో కూడిన దేవాలయాలు చాలానే ఉన్నాయి. కానీ, హైదరాబాద్‌కు జస్ట్ ఒక గంట ప్రయాణ దూరంలో, రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం చందిప్ప గ్రామంలో ఉన్న ఒక అరుదైన శివక్షేత్రం గురించి చాలా మందికి తెలియదు. అదే శ్రీ మరకత శివలింగ సోమేశ్వర స్వామి ఆలయం.
సాధారణంగా మనం నల్లటి రాతితో చేసిన శివలింగాలను చూస్తుంటాం. కానీ ఇక్కడ పరమశివుడు స్వచ్ఛమైన ఆకుపచ్చ రంగులో మెరిసిపోయే మరకత లింగం రూపంలో దర్శనమిస్తాడు. ఈ ఒక్క లింగాన్ని దర్శించుకుంటే చాలు, ఎంతటి మొండి రోగాలైనా నయమైపోతాయని భక్తుల నమ్మకం. అందుకే దీన్ని తెలంగాణ వైద్యనాథ క్షేత్రం అని కూడా పిలుస్తారు.
25
పచ్చని రత్నమై మెరిసే మరకత లింగం మిస్టరీ ఇదే
మరకతం అంటే పచ్చ రత్నం. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఇది బుధ గ్రహానికి చిహ్నం. చందిప్ప ఆలయంలోని ఈ శివలింగంపై కాంతి పడినప్పుడు లేదా అభిషేకం చేస్తున్నప్పుడు ఒక డిఫరెంట్ గ్రీనిష్ గ్లో కనిపిస్తుంది. ఈ వైబ్రేషన్స్ చూడటానికి రెండు కళ్లూ చాలవు.
మహారాష్ట్రలో ఉన్న ప్రముఖ జ్యోతిర్లింగం వైద్యనాథ్ ఎలాగైతే భక్తుల రోగాలను నయం చేస్తుందో, అలాగే ఇక్కడి మరకత సోమేశ్వరుడు కూడా భక్తులకు ఆయురారోగ్యాలను ప్రసాదిస్తాడని నమ్మకం. ఈ లింగం ముందు కూర్చుని కాసేపు ధ్యానం చేస్తే మైండ్ సూపర్ పీస్ ఫుల్ గా మారుతుంది.
35
వెయ్యి ఏళ్ల నాటి హిస్టరీ.. చాళుక్యుల కాలం నాటి గుడి
ఈ గుడి నిన్న మొన్న కట్టింది కాదు.. దీనికి దాదాపు 1000 ఏళ్ల హిస్టరీ ఉంది. 11వ శతాబ్దానికి చెందిన పశ్చిమ చాళుక్య రాజు ఆరో విక్రమాదిత్యుడు (క్రీ.శ. 1076-1126) కాలంలో, 1101 అక్టోబర్ 23న ముచుకుంద నది తీరాన ఈ క్షేత్రాన్ని ప్రతిష్ఠించినట్లు ఇక్కడి శాసనాలు చెప్తున్నాయి. ఆ రోజుల్లో ఈ ఆలయ మెయింటెనెన్స్, పండగల కోసం ఏకంగా 250 ఎకరాల భూమిని దానంగా ఇచ్చినట్టు సమాచారం.
కాలక్రమేణా ఈ ఆలయం కాస్త డ్యామేజ్ అయి, అందరూ మర్చిపోయే స్టేజ్‌కి వచ్చింది. కానీ, 2000ల ఆరంభంలో ఈ ప్లేస్ మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చింది. ఆ తర్వాత 2011-12లో లోకల్ పీపుల్ అంతా కలిసి ఈ గుడిని సూపర్బ్ గా రినోవేట్ చేశారు.
ఈ ఆలయానికి ఇంకో ఇంట్రెస్టింగ్ హిస్టరీ ఉంది. 2007 మహాశివరాత్రి రోజున ఒక మ్యాజిక్ జరిగింది. ఆ రోజు ఉదయాన్నే సూర్య కిరణాలు నేరుగా గర్భగుడిలోకి ప్రవేశించి, శివలింగంపై పడ్డాయి. ఆ కిరణాల కాంతికి శివలింగం మొత్తం పచ్చటి వెలుగుతో నిండిపోయింది. అప్పటివరకు అది నార్మల్ శివలింగం అనుకున్న వాళ్లంతా షాక్ అయ్యారు. అది ప్యూర్ మరకత శివలింగం అని ఆ రోజే అఫీషియల్‌గా ప్రూవ్ అయింది. అప్పటినుంచి ఈ టెంపుల్ కి భక్తుల రష్ బాగా పెరిగిపోయింది.
55
5 సోమవారాల వ్రతం.. ఇక్కడి పవర్స్ ఏంటి?
ఈ సోమేశ్వర స్వామి దగ్గర కొన్ని స్పెషల్ పూజలు చేస్తే అనుకున్న పనులు గ్యారంటీగా జరుగుతాయని భక్తుల నమ్మకం. ఐదు సోమవారాలు లేదా ఐదు పౌర్ణమిలు ఇక్కడికొచ్చి స్వామివారికి అభిషేకం చేస్తే లైఫ్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయని నమ్ముతారు. పౌర్ణమి రోజు ఇక్కడి అభిషేక జలాలతో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయట. ముఖ్యంగా బుధ దోషం ఉన్నవాళ్లు బుధవారం నాడు ఇక్కడ శివాభిషేకం చేసి, ఓం నమః శివాయ అని జపిస్తే కెరీర్ లో గ్రోత్, బిజినెస్ లో సక్సెస్ వస్తుందని నమ్ముతారు.