Horoscope: ఈ రాశి వారికి ఇంట శుభకార్యాలు..వారికి మాత్రం బంధువులతో వివాదాలు

Published : May 09, 2025, 08:51 PM IST

ఇంట శుభకార్యాలు, కొత్త అవకాశాలు కొన్ని రాశులకు లభించనున్నాయి. మరికొందరికి బంధువులతో వివాదాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి.

PREV
112
Horoscope: ఈ రాశి వారికి ఇంట శుభకార్యాలు..వారికి మాత్రం బంధువులతో వివాదాలు
మేషం

 

మేష రాశి వారికి చేపట్టిన పనులలో అవరోధాలు ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. ఆశించిన రీతిలో రాబడి ఉండదు. బంధు మిత్రులతో ఆకస్మిక వివాదాలు కలిగే అవకాశాలున్నాయి.వృత్తి వ్యాపారాలలో చికాకులు ఉంటాయి. ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి. ఉద్యోగం చేసే చోటు చికాకులు ఉంటాయి.

212
వృషభం

వృషభ రాశి వారికి సమాజంలో పలుకుబడి పెరుగుతోంది. వృత్తి ఉద్యోగాలలో ప్రతిభ వెలుగులోకి వస్తుంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. ఆర్థిక పురోగతి కలుగుతోంది. వ్యాపారాలలో  లాభాలు అందుకుంటారు. 

312
మిథునరాశి

మిథున రాశి వారు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో విందువినోదాల్లో పాల్గొంటారు.నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. ఉద్యోగార్థులకు ఆశించిన ఫలితాలు పొందుతారు.

412
కర్కాటకం

కర్కాటక రాశి వారు ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు ఉంటాయి. ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి.

512
సింహం

సింహ రాశి వారికి ప్రయాణాలు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్యమైన పనులలో అవాంతరాలు ఏర్పడతాయి.నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు.ఉద్యోగస్తులకు పని భారం పెరుగుతుంది.

612
కన్య

కన్య రాశి వారు కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి.చేపట్టిన పనుల్లో పురోగతి కనపడుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.ఆదాయం మరింతగా పెరుగుతుంది. పాత మిత్రులను కలుసుకుంటారు.
 

712
తుల

తుల రాశి నిరుద్యోగుకు నూతన అవకాశాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాల పరిస్థితి మరింత అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. ముఖ్యమైన పనులలో ఆప్తుల సలహాలు తీసుకుంటే బెటర్‌. భూ కొనుగోలు ప్రయత్నాలు లభిస్తాయి. 

812
వృశ్చికం

ఇంటా బయట సమస్యలు మరింత పెరుగుతాయి. దూరప్రయాణాలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఆధ్మాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన కార్యక్రమాలలో అవరోధాలు కలుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

912
ధనస్సురాశి

ఆదాయానికి మించి ఖర్చులుంటాయి.బంధువులతో వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు కలుగుతాయి. విద్యార్థులకు నిరుద్యోగులకు అతి కష్టం మీద స్వల్ప ఫలితాలు పొందుతారు.మానసిక అశాంతి కలుగుతుంది.

1012
మకరం

మకర రాశి వారి ఇంటశుభకార్య వాతావరణం ఉంటుంది.ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. భూసంబంధిత క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.చేపట్టన పనులలో విజయం సాధిస్తారు. 
 

1112
కుంభం

కుంభ రాశి వారికి చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం కలుగుతుంది. దైవ చింతన పెరుగుతుంది.వృత్తి వ్యాపారాలలో చికాకులు తప్పవు. 

1212
మీనం

మీనరాశి వారికి సమాజంలో పేరు కలిగి వారితో పరిచయాలు ఏర్పడతాయి. సోదరులతో వివాదాలు పరిష్కారం అవుతాయి.గృహంలో శుభకార్యాలు ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో ఒత్తిడిని అధిగమించి లాభాల అందుకుంటారు.

Read more Photos on
click me!

Recommended Stories