వినాయక చవితి వ్రతం, శుభ ముహూర్తం
శ్రావణ శుక్లపక్ష చతుర్థి తేదీ ఆగస్టు 19 రాత్రి 10:19 గంటలకు ప్రారంభమై ఆగస్టు 21 మధ్యాహ్నం 12:21 గంటలకు ముగుస్తుందని పంచాంగంలో పేర్కొన్నారు. ఉదయ తిథి ప్రకారం.. వినాయక చవితి వ్రతం ఆగస్టు 20 ఆదివారం నాడు ఆచరించబడుతుంది. ఈ రోజున అనేక పవిత్రమైన యోగాలు ఏర్పడనున్నాయి. వీటిలో ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. వినాయక చవితి రోజున సధ్యయోగం, శుభయోగం, సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం, రవియోగం వంటివి ఏర్పడనున్నాయి. అలాగే ఇవి రోజంతా అలాగే కొనసాగుతాయి.