Money Plant: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉన్నా డబ్బు నిలవట్లేదా? అయితే ఈ ఫెంగ్ షుయ్ చిట్కాలు పాటించాల్సిందే. ఫెంగ్ షుయ్ ప్రకారం మనీ ప్లాంట్ దగ్గర ఈ ఒక్క వస్తువు పెడితే తరతరాలకు సరిపడా సంపద సొంతమవుతుందట. మరీ సంపద పెంచే ఆ వస్తువు ఏంటో తెలుసుకుందామా..
మనలో చాలామంది ఇంట్లో సిరిసంపదలు పెరగాలని మనీ ప్లాంట్ పెంచుకుంటారు. ఫెంగ్ షుయ్ ప్రకారం మనీ ప్లాంట్ ని పెట్టినంత మాత్రాన అది 'మనీ మ్యాగ్నెట్'గా మారిపోదు. ఆ మొక్కలో దాగి ఉన్న శక్తిని యాక్టివేట్ చేయాలట. అప్పుడే ఇంట్లో సిరిసంపదలు పెరుగుతాయట. మరి మనీ ప్లాంట్ తో ఏం చేస్తే సంపద రెట్టింపవుతుందో ఇక్కడ తెలుసుకుందాం.
26
మెరిసే వస్తువుతో..
ఫెంగ్ షుయ్, క్రిస్టల్ థెరపీ ప్రకారం.. మనీ ప్లాంట్ దగ్గర లేదా దాని కుండీలో ఒక మెరిసే వస్తువును ఉంచితే, ఇంట్లోని వెల్త్ కార్నర్ యాక్టివేట్ అవుతుంది. దానివల్ల డబ్బు అయస్కాంతంలా మీవైపు ఆకర్షించబడుతుంది.
36
పైరైట్ క్రిస్టల్
ఈ మ్యాజికల్, బంగారంలా మెరిసే క్రిస్టల్‌ను 'పైరైట్ క్రిస్టల్' అంటారు. ఇది చూడటానికి పసుపు రంగులో, మిలమిల మెరుస్తూ ఉంటుంది. చూడడానికి నిజమైన బంగారంలా కనిపిస్తుంది. అందుకే ఫెంగ్ షుయ్‌లో దీన్ని 'ఫూల్స్ గోల్డ్' అని కూడా పిలుస్తారు.
ముందుగా ఒక పైరైట్ క్రిస్టల్ తీసుకోవాలి. ఒక చిన్న ముక్క లేదా కొన్ని చిన్న చిన్న పైరైట్ కణాలను తీసుకొని.. వాటిని మీ మనీ ప్లాంట్ కుండీలోని మట్టి పైన, మొక్క ప్రధాన వేరు దగ్గర పెట్టాలి. ఒకవేళ మొక్క నీటిలో పెరుగుతుంటే, ఆ బాటిల్ దగ్గర పెడితే సరిపోతుంది.
56
పది రెట్ల సంపద
ఫెంగ్ షుయ్ ప్రకారం పైరైట్ క్రిస్టల్ ప్రత్యేక నిర్మాణం కారణంగా, ఇది విశ్వం నుంచి సంపద, శ్రేయస్సు, కొత్త అవకాశాలను ఆకర్షిస్తుందట. ఇది మనీ ప్లాంట్ 'వుడ్ ఎనర్జీ'తో కలిసినప్పుడు, డబ్బు రాక పది రెట్లు పెరుగుతుందట.
66
క్లియర్ క్వార్ట్జ్
మీ దగ్గర పైరైట్ అందుబాటులో లేకపోతే, మనీ ప్లాంట్ కుండీలో ‘క్లియర్ క్వార్ట్జ్’ క్రిస్టల్‌ను పెట్టవచ్చు. ఫెంగ్ షుయ్‌లో దీన్ని 'మాస్టర్ హీలర్' అంటారు. ఇది మొక్క సానుకూల శక్తిని పెంచి, ధన ప్రవాహానికి అడ్డుగా ఉన్న ప్రతి ఆటంకాన్ని తొలగిస్తుందని నమ్మకం.