నేపాల్ రాజధాని కాఠ్మాండూలో పశుపతినాథ్ గుడి ఉంది. కలియుగం అంతానికి ఈ ఆలయానికి సంబంధం ఉందని స్థల పురాణాలు, స్థానికుల మాటల ద్వారా తెలుస్తుంది. పశుపతినాథ్ ఆలయంలో శివ లింగం కాకుండా శివుని ముఖ రూపాన్ని మనం చూడొచ్చు.
శివుడి అనుగ్రహం పొందాలంటే కేదార్‌నాథ్ క్షేత్రాన్ని దర్శించాలని పండితులు చెబుతారు. అయితే కేదారనాథ్ తో పాటు పశుపతినాథ్ ఆలయాన్ని కూడా దర్శనం చేసుకోవాలని అంటారు. ఎందుకంటే పశుపతినాథ్ శివుని శక్తి కేంద్రం అని నేపాల్ వాసులు బాగా నమ్ముతారు.