ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు, సుఖాలు ఉంటాయి. సుఖాలు సంతోషాన్నిస్తాయి. కానీ కష్టాలు మనిషిని కుంగదీస్తాయి. అయితే కష్టాల సమయంలో మనం ఎంత గట్టిగా నిలబడ్డామనేది మన వ్యక్తిత్వాన్ని, ధైర్యాన్ని చూపిస్తుంది. చాణక్యుడి నీతి ప్రకారం కష్ట కాలంలో 3 విషయాలు తప్పకుండా గుర్తించుకోవాలి. అవెంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఆచార్య చాణక్యుడి సూత్రాలు ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందాయి. జీవితంలో ఏదైనా సాధించడానికి చాణక్యుడి సూత్రాలు సహాయపడతాయి. ఆయన తన నీతి సూత్రాల్లో మానవుడికి సరైన మార్గాన్ని చూపే అనేక విషయాలు బోధించాడు. వాటిని అనుసరిస్తే ఏ పరిస్థితిలోనూ అపజయం ఉండదని చాలామంది నమ్ముతారు.
25
కష్టకాలంలో గుర్తించుకోవాల్సిన విషయాలు..
చాణక్యుడు మానవ జీవితం గురించి చాలా విషయాలు చెప్పాడు. అతని నీతిని పూర్తిగా చదివి అనుసరిస్తే విజయం సులభం అవుతుంది. ఎవరైన సరే కష్టాల్లో ఉన్నప్పుడు ఈ 3 విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలని చాణక్యుడు బోధించాడు. అవి మీ జీవితానికి సహాయపడతాయని తెలిపాడు. అవేంటో చూద్దాం.
35
ఆరోగ్య సంరక్షణ..
చాణక్య నీతి ప్రకారం, ఒక వ్యక్తి మొదట తన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే అదే అతని అతిపెద్ద సంపద. మీ ఆరోగ్యం బాగా ఉంటే సమస్యల నుంచి బయటపడవచ్చు. ప్రత్యేకించి మీ సవాళ్లను అన్నింటినీ మీరే సులభంగా ఎదుర్కోవచ్చు. కాబట్టి ఆరోగ్యాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదని చాణక్యుడు తన నీతిసూత్రాల్లో పేర్కొన్నాడు.
45
కష్ట సమయంలో శ్రద్ధ అవసరం:
చాణక్యుడి ప్రకారం సంక్షోభ సమయంలో ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కష్ట కాలంలోనే తరచుగా ఎక్కువ సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. చిన్న పొరపాటు కూడా పెద్ద నష్టాలకు దారితీస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం.
55
కుటుంబ సభ్యుల భద్రత ముఖ్యం:
కుటుంబ సభ్యులను కాపాడుకోవడం కుటుంబ పెద్ద బాధ్యత. వారి అవసరాలను తీర్చడం, బాధ్యతలు నెరవేర్చడం ఆ వ్యక్తి మొదటి కర్తవ్యమని చాణక్యుడు తన నీతి సూత్రాల్లో చెప్పాడు. కుటుంబ సభ్యుల భద్రతపై కూడా శ్రద్ధ వహించాలంటాడు చాణక్యుడు. ఇలా చేయడం ద్వారా ఏ సమస్య నుంచైనా మీరు బయటపడవచ్చని ఆచార్యుడి బోధనలు చెబుతున్నాయి.