vastu tips: మీ ఇంటి గుమ్మాలు ఇలా ఉంటే ఎంత అదృష్టమో.. దేనికీ తిరుగుండదు!

vastu tips: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి గుమ్మానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ విధంగా ఇంటి గుమ్మాలు ఉంటే ఆ ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుంది. అంతేకాదు ఆ ఇంట్లో ఉండేవాళ్లకి అదృష్టం కూడా కలిసి వస్తుంది. మరి ఆ నియమాల గురించి తెలుసుకుందామా?

vastu tips for main door positive energy wealth house in telugu sns

సాధారణంగా ఇంటి యజమాని రెక్కలు ముక్కలు చేసుకొని ఇల్లు కడతాడు. ఆ కుటుంబసభ్యులు అందరూ ఆ ఇంట్లో సంతోషంగా, సిరిసంపదలతో జీవించాలని కోరుకుంటారు. అయితే ఇల్లు కట్టేటప్పుడు వాస్తు శాస్త్ర నియమాలు పాటించకపోతే ఇంట్లో వాస్తు దోషాలు ఏర్పడతాయి. దీంతో ఆ ఇంట్లో జీవించే వారి జీవితాల్లో సమస్యలు పెరుగుతాయి. ముఖ్యంగా ఇంటి ప్రధాన ద్వారం విషయంలో కొన్ని నియమాలు ఉన్నాయి. వాటిని పాటిస్తే ఇంట్లో ఎప్పుడూ సంతోషం ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి ప్రధాన ద్వారం చాలా ముఖ్యం. ఎందుకంటే దీని ద్వారానే పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది. దీన్ని వాస్తు ప్రకారం ఏర్పాటు చేయడం వల్ల నెగెటివ్ శక్తులు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. కాబట్టి ఇంటి ప్రధాన ద్వారం ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.

ఇది కూడా చదవండి: అదృష్టమంటే ఈ 3 రాశుల వారిదే.. ఉగాది నుంచి భారీగా ధన లాభం  


గుమ్మం దిశ

వాస్తు శాస్త్రంలో దిక్కులకు చాలా ప్రాముఖ్యత ఉంది. వాస్తు శాస్త్రంలో చెప్పిన దిక్కుల ప్రకారం ఇల్లు కట్టినా లేదా ఇంట్లో వస్తువులు పెట్టినా మీ జీవితంలో శ్రేయస్సు పెరుగుతుంది. ప్రశాంతత నెలకొంటుంది. కాబట్టి వాస్తు ప్రకారం మీ ఇంటి ప్రధాన ద్వారం ఈశాన్యం, తూర్పు లేదా పశ్చిమ దిశలో ఉండాలి. ఈ దిశలో ఉంటే ఇంట్లో వాళ్లకి అదృష్టం కలిసి వస్తుందని వాస్తు పండితులు చెబుతున్నారు. అనుకోని లాభాలు కూడా వస్తాయట. ముఖ్యంగా ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఎప్పుడూ ఉంటుంది.

ఏ దిక్కులో గుమ్మం ఉండకూడదు?

వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంటి ప్రధాన ద్వారం ఎప్పుడూ దక్షిణం, వాయువ్యం, నైరుతి దిక్కుల్లో ఉండకూడదు. ఈ దిక్కులో తలుపు ఉంటే అశుభంగా భావిస్తారు. దీనివల్ల కూడా ఇంట్లో వాస్తు దోషాలు ఏర్పడతాయి. ఇంట్లో నివసించే వాళ్ల జీవితంలో చాలా సమస్యలు వస్తాయి.

ఇది కూడా చదవండి:  స్నానం చేసేటప్పుడు సబ్బుతో మొదట మొహం రుద్దుకోవాలా? ఒళ్లు రుద్దుకోవాలా?

గుమ్మంకు సంబంధించిన ఇతర వాస్తు చిట్కాలు

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం పెద్దగా ఉండాలి. దీనివల్ల ఇంట్లోకి వెలుతురు బాగా వస్తుంది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ముఖ్యంగా గుమ్మానికి ఎలాంటి మురికి ఉండకూడదు. ఇంటి ప్రధాన ద్వారం ఎప్పుడూ చీకటిగా ఉండకూడదు.

Latest Videos

vuukle one pixel image
click me!