Dosa Prasadam: ఈ గుడిలో ప్రసాదంగా దోశలు పెడతారు.. ఆ దోశ స్పెషాలిటీ ఏంటో తెలుసా?

Published : Mar 16, 2026, 05:00 PM IST

 Dosa Prasadam: దేవాలయాలలో ప్రసాదం అనేది విశ్వాసానికి ప్రతీకగా పంపిణీ చేస్తారు. సాధారణంగా ప్రసాదంగా లడ్డు, పులిహోర లేదా ఇంకేదైనా స్వీట్ పెపడతారు. కానీ, దోశను ప్రసాదంగా పెట్టే ఆలయం ఏదో మీకు తెలుసా? 

PREV
13
దోశ ప్రసాదం..

మన దేశంలో చాలా దేవాలయాలు ఉన్నాయి. ప్రతి దేవాలయంలో భక్తులకు ప్రసాదం పంపిణీ చేస్తూ ఉంటారు. కొన్ని ఫేమస్ టెంపుల్స్ లో మాత్రం.. స్పెషల్ ప్రసాదాలు పెడుతూ ఉంటారు. అయితే.. ఇప్పటి వరకు.. లడ్డూ, పులిహోర, పొంగలి లాంటి ఆహారాలను ప్రసాదాలుగా పెట్టడం చూశాం... తిన్నాం.. కానీ... ఎప్పుడైనా ప్రసాదంగా దోశ పెట్టే గుడి ఎక్కడ ఉందో మీకు తెలుసా? అక్కడ అలా దోశ పెట్టడం వెనక కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

23
విష్ణు ఆలయం..

తమిళనాడులోని మదురై సమీపంలో ఉన్న ఈ ఆలయం కల్లాళగర్ (మహావిష్ణువు) కు నిలయం. ఇక్కడ ఇచ్చే ప్రసాదం కేవలం రుచి కోసమే కాదు, దాని తయారీ వెనుక ఒక విశిష్టమైన పద్ధతి ఉంది.

1. ఈ దోశ సాధారణ దోశ కంటే ఎలా భిన్నంగా ఉంటుంది?

తయారీ విధానం: మనం ఇంట్లో చేసుకునే దోశలు పల్చగా ఉంటాయి, కానీ ఈ ప్రసాదం దోశలు మందంగా (Thick), కొంచెం గట్టిగా ఉంటాయి.

దినుసులు: బియ్యం, మినప్పప్పుతో పాటు మిరియాలు (Black Pepper), జీలకర్ర , ఇతర మసాలా దినుసులు వాడతారు. దీనివల్ల ఇది ఘాటుగా, రుచిగా ఉంటుంది.

నెయ్యి వాడకం: ఈ దోశలను కేవలం శుద్ధమైన నెయ్యి (Pure Ghee) తోనే కాలుస్తారు. నెయ్యిలో వేయించడం వల్ల ఇవి చాలా రోజుల వరకు పాడవకుండా తాజాగా ఉంటాయి.

33
2. ఆరోగ్య పరంగా కూడా మేలే..

ఇందులో మిరియాలు, జీలకర్ర , నెయ్యి ఉండటం వల్ల ఇది జీర్ణక్రియకు మంచిది. పూర్వకాలంలో కొండల మధ్య ఉండే ఈ ఆలయానికి వచ్చే భక్తులకు శక్తినిచ్చే ఆహారంగా దీనిని భావించేవారు.

3. భక్తుల నమ్మకం:

ఈ ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల స్వామివారి ఆశీస్సులు లభించడమే కాకుండా, ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే ఇక్కడికి వచ్చే భక్తులు ఈ "అళగర్ కోవిల్ దోశ"ను ఇంటికి కూడా పట్టుకెళ్తుంటారు.

Read more Photos on
click me!

Recommended Stories