Ugadi Festival 2026: తెలుగు సంవత్సరాది ఉగాది..అత్యంత పవిత్రమైన రోజు. కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలతో ముందుకెళ్లాల్సిన శుభదినం. మరి అలాంటి కొత్త ఏడాదిలో ఏ సమయంలో పూజ చేయాలి? శుభ ముహూర్తం ఎప్పుడు?
తెలుగు సంవత్సరాది అయిన ఉగాది పండుగను ఎంతో శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజున ఏ పని తలపెట్టినా విజయం సిద్ధిస్తుందని నమ్ముతారు. అందుకే చాలా మంది భగవంతుడిని ప్రార్థించి కొత్త పనులు ప్రారంభించాలనుకుంటారు. అయితే ఉగాది రోజున ఏ సమయం మంచిది? పూజకు సరైన ముహూర్తం ఎప్పుడు అనే సందేహం చాలా మందికి ఉంటుంది.
24
ఉగాది రోజు పూజకు శుభ ఘడియలు
పంచాంగం ప్రకారం ఉగాది రోజున సూర్యోదయం తర్వాత పూజలు చేయడం మంచిదని భావిస్తారు. ఉదయం 6 నుంచి 10 గంటల మధ్య పూజలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో దేవుడిని ప్రార్థించి కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించాలని సూచిస్తున్నారు.
34
ఉగాది రోజున చేయాల్సిన ముఖ్యమైన పని పంచాంగ శ్రవణం
ఉగాది రోజు ఉదయమే లేచి నూనెతో స్నానం చేయాలి. ఇంటి ముందు అందమైన రంగవల్లులు వేయడం సంప్రదాయం. అలాగే ఇంటి తలుపులకు మామిడి ఆకులతో తోరణం కట్టి పండుగ వాతావరణాన్ని తీసుకొస్తారు. తర్వాత కుటుంబసభ్యులంతా కలిసి దేవుడికి పూజలు చేస్తారు.
ఉగాది రోజున చేయాల్సిన ముఖ్యమైన పని పంచాంగ శ్రవణం చేయడం. కొత్త ఏడాదిలో గ్రహాల ప్రభావం ఎలా ఉంటుంది, రాశుల ఫలితాలు ఎలా ఉంటాయో పండితులు వివరిస్తారు.
ఈ రోజున ప్రత్యేకంగా తయారు చేసే ప్రసాదం ఉగాది పచ్చడి. ఇందులో తీపి, పులుపు, చేదు, ఉప్పు, వగరు, కారం వంటి షడ్రుచులు ఉంటాయి. ఇదే జీవితంలో ఎదురయ్యే వివిధ అనుభవాలను సూచిస్తాయని పెద్దలు చెబుతారు.
ఉగాది రోజ పూజ సమయం, ఆచారాలు ప్రాంతాల బట్టి కాస్త భిన్నంగా ఉంటుంది. పండితులు సూచించిన సమయాల్లో పూజలు చేయడం సత్ఫలితాలను ఇస్తుందని నమ్ముతారు. కుటుంబసభ్యులు, బంధువులతో కలిసి ఈ పండుగను జరుపుకుంటే ఉగాది ఆనందం మరింత అద్భుతంగా ఉంటుంది.