Chanakya Niti: ఇలాంటి స్త్రీలకు దూరంగా ఉండకపోతే.. మీ లైఫ్ డేంజర్లో పడినట్లే..!

Published : Sep 18, 2025, 05:19 PM IST

Chanakya Niti: కొంత మంది స్త్రీలు తమ ఆకర్షణ, ప్రవర్తనతో తమ చుట్టూ ఉన్న పురుషులను ప్రభావితం చేసే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ స్త్రీలు.. పురుషులను తమ వలలో వేసుకోవడంలో, వారి సొంత స్వార్థ లక్షణాలను సాధించడంలో నిష్ణాతులు.

PREV
15
Chanakya Niti

ఆచార్య చాణక్యుడు మానవ జీవితం గురించి చాలా విషయాలను తెలియజేశాడు. ముఖ్యంగా.. స్త్రీ, పురుషుల స్వభావం గురించి కూడా ఆయన చాణక్య నీతిలో పొందుపరిచారు. ఆయన ప్రకారం.. కొంత మంది స్త్రీలు తమ ఆకర్షణ, ప్రవర్తనతో తమ చుట్టూ ఉన్న పురుషులను ప్రభావితం చేసే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ స్త్రీలు.. పురుషులను తమ వలలో వేసుకోవడంలో, వారి సొంత స్వార్థ లక్షణాలను సాధించడంలో నిష్ణాతులు. కాబట్టి, ఈ లక్షణాలు ఉన్న స్త్రీల విషయంలో పురుషులు జాగ్రత్తగా ఉండాలి. మరి, చాణక్యుడి ప్రకారం... ఎలాంటి లక్షణాలు ఉన్న స్త్రీలకు దూరంగా ఉండాలో తెలుసుకుందాం....

25
అసంతృప్తి....

చాణక్యుడి ప్రకారం, ఎల్లప్పుడూ అసంతృప్తిగా ఉన్న స్త్రీలు తమ భాగస్వామితో లేదా ఏ ఒక్క వ్యక్తితోనూ సంతృప్తి చెందరు. వారు నిరంతరం కొత్త వ్యక్తుల కోసం చూస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు కొత్త సంబంధాల కోసం చూస్తూ ఉంటారు. వీరికి అసంతృప్తి చాలా ఎక్కువ. ఇలాంటి స్త్రీలతో ఉన్న పురుషులు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు.

35
నకిలీ చిరునవ్వు....

కొందరు స్త్రీలు.. అందరితో చాలా మధురంగా మాట్లాడుతూ ఉంటారు. వీరు మనస్ఫూర్తిగా నవ్వరు. ఎప్పుడూ ముఖంలో ఫేస్ స్మైల్ ని క్యారీ చేస్తూ ఉంటారు. నకిలీ చిరునవ్వుతో అందరినీ ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. వారు ప్రతి పురుషుడినీ ఆకర్షించడానికి ప్రయత్నిస్తారు. దాదాపు అందరూ ఇలాంటి అమ్మాయిల పట్ల చాలా తొందరగా ఆకర్షితులౌతారు.

45
విచారంగా , నిస్సహాయంగా కనిపించడం

మరో ముఖ్యమైన లక్షణం ఏమిటంటే వారు తమ సంభాషణలలో తమను తాము విచారంగా , నిస్సహాయంగా పదేపదే చిత్రీకరించుకుంటారు. ఇలా చేయడం ద్వారా, వారు సానుభూతిని పొందుతారు. పురుషులను తమ దగ్గరికి ఆకర్షించడానికి దీనిని ఒక సాకుగా ఉపయోగిస్తారు.

55
సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా ఉండాలనుకుంటారు...

ఇటువంటి మహిళలు ఏ పార్టీలోనూ, కుటుంబంలోనూ లేదా సమాజంలోనూ తామే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా ఉండాలని అనుకుంటారు. దృష్టిని ఆకర్షించడానికి వారు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు . ఈ స్వభావం ప్రజలను వారితో ప్రేమలో పడేలా చేస్తుంది.

తొందరగా విడిపోతారు...

ఈ మహిళలు త్వరగా సంబంధాలను ఏర్పరచుకుంటారు. అంతే తొందరగా విడిపోతారు. కేవలం తమ సొంత కోరికలను తీర్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. తమకు నచ్చిన పనులు చేస్తే.. ఆ బంధంలో కొనసాగుతారు. తమకు నచ్చినట్లు చేయకపోతే.. ఆ బంధాన్ని వదులుకుంటారు. కేవలం తమ అవసరాలు తీర్చుకోవడానికే వీరు ఏ బంధాన్ని అయినా వాడుకుంటారు. అందువల్ల, వారు శాశ్వత సంబంధాలను ఏర్పరచుకోకుండా ఉంటారు.

ఆచార్య చాణక్యుడి సూత్రాలను ఇప్పటికీ జీవితంలో మార్గదర్శకంగా భావిస్తారు. పురుషులు ఈ లక్షణాలు ఉన్న స్త్రీలను త్వరగా గుర్తించి వారికి దూరంగా ఉండాలి. ఈ లక్షణాలు ఉన్న స్త్రీలకు దూరంగా ఉంటే.. అబ్బాయిలు సేఫ్ జోన్ లో ఉంటారు.

Read more Photos on
click me!

Recommended Stories