ప్రాణ ప్రతిష్ఠకు ముందు రాములోరి విగ్రహం కళ్లకు గంతలు ఎందుకు కడతారో తెలుసా?

First Published Jan 22, 2024, 1:31 PM IST

ప్రతిష్ఠకు ముందు అయోధ్య రాముడి విగ్రహం కళ్లకు గంతలు కట్టి ఉన్న ఫోటోలను మీరు చూసే ఉంటారు. అసలు భగవంతుడికి విగ్రహం కళ్లకు ఎందుకు గంతలు కడతారు? శిల్పం భగవంతుడిలా ఎలా మారుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

ram mandir ayodhya

ఎంతో పవిత్రమైణ అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం పూర్తి అయ్యింది. ఈ పుణ్య కార్యక్రమాన్ని చూడటానికి దేశ విదేశాల నుంచి ఎంతో మంది రామ భక్తులు అయోధ్యకు తరలివెళ్లారు. ఈ రోజు ఆలయంలో రామ్ లల్లాను ప్రతిష్టించారు. మీకు తెలుసా? ప్రతిష్ఠ కు వారం రోజుల ముందు నుంచే పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే ఈ జనవరి 17నే శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. నేడు ప్రతిష్ఠించారు. అయితే ప్రతిష్టకు ముందు రాముడి విగ్రహం కళ్లకు గంతలు కట్టారు. ప్రతిష్ట పూర్తైన తర్వాతనే కళ్లకున్న గంతలను తొలగించారు. అసలు ప్రతిష్ఠకు ముందు విగ్రహానికి కళ్లకు గంతలు ఎందుకు కడతారు? దానివెనకున్న రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

మతపరమైన ప్రాముఖ్యత

పండితుల ప్రకారం.. ప్రతిష్ఠ తర్వాత ముందుగా భగవంతుని పాదాలనే మనం చూడాలి. ఈ సమయంలో మనం దేవుడిని స్మరించుకోవాలి. అలాగే మంత్రాలను పఠించాలి. ఆ తర్వాతనే స్వామివారి ప్రతిమను చూడాలని పండితులు చెబుతున్నారు.
 

అయితే విగ్రహ దర్శన సమయంలో భక్తులు నేరుగా స్వామివారి కళ్లలోకి చూస్తూ తమ భావాలను వ్యక్తపరుస్తారు. భక్తుని మనోభావాలను బట్టి భగవంతుడు కూడా లొంగిపోతాడట. భక్తుని మనోభావాలు తెలిశాక భగవంతుడు వారితో వెళ్తాడని శాస్త్రాల్లో పేర్కొన్నారు. అందుకే శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠకు ముందు కళ్లకు గంతలు కట్టారట. ఈ రోజు ప్రతిష్ట పూర్తి అయ్యింది కాబట్టి.. రాములోరి విగ్రహం కళ్లకు ఉన్న గంతలను తొలగించారు. 

పగిలిన అద్దం రహస్యం

విగ్రహాన్ని ప్రతిష్ఠించే సమయంలో శక్తి కిరణాలు విగ్రహంలోకి ప్రవేశిస్తాయని శాస్త్రాల్లో ఉంది. అందుకే కళ్లకు ఉన్న గంతలు తొలగించగానే ఈ ప్రకాశవంతమైన శక్తి బయటకు వస్తుందట. దీనికి అపారమైన శక్తి ఉంటుందని శాస్త్రాల్లో ఉంది. ధార్మిక గ్రంధాల ప్రకారం.. ప్రతిష్ఠ తర్వాత దేవుళ్లు లేదా దేవతల కళ్లు తెరిచినప్పుడు ప్రకాశవంతమైన కాంతి బయటకు వస్తుంది.
 

Ram Mandir, Ram Lalla idol

ఈ సమయంలో స్వామివారికి అద్దం చూపిస్తారు. ఎందుకంటే విగ్రహం నుంచి వెలువడే ప్రకాశవంతమైన శక్తి అద్దాన్ని తాకుతుంది. ఈ అపారమైన శక్తే అద్దాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. ఈ ప్రకాశవంతమైన శక్తిని తట్టుకోవడం కష్టం. అందుకే కళ్లకున్న గంతలు తీసేసిన వెంటనే భగవంతునికి దర్పణాన్ని చూపిస్తారు.

click me!