అయోధ్య రామ మందిర విశేషాలు
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం ప్రకారం.. ఈ ఆలయాన్ని సంప్రదాయ నాగర నిర్మణ శైలిలో నిర్మించారు.
ఈ ఆలయం మూడు అంతస్తులు ఉంది. ఒక్కో అంతస్తు ఇరవై అడుగుల ఎత్తులో ఉంది. ఈ ఆలయానికి మొత్తం 44 ద్వారాలు, 392 స్తంభాలు ఉన్నాయి. ఐదు మండపాలు లేదా హాళ్లు ఉన్నాయి.
ఇక ఈ ఆలయం ప్రవేశ ద్వారం తూర్పు నుంచి ఉంటుంది. యాత్రికులు సింగ్ ద్వారం గుండా 32 మెట్లు ఎక్కాలి. అయితే వయసు మళ్లిన వారు, వికలాంగుల కోసం లిఫ్టులు, ర్యాంపులు అందుబాటులో ఉన్నట్టు ట్రస్ట్ పేర్కొంది.