ఆదివారం తులసమ్మ దగ్గర దీపం పెట్టొచ్చా?

First Published Jan 21, 2024, 11:51 AM IST

తులసి మొక్కకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ మొక్కను క్రమం తప్పకుండా పూజిస్తే పుణ్య ఫలితాలు లభిస్తాయి. మరి తులసి మొక్కకు ఆదివారం నాడు దీపం పెట్టొచ్చా? పెడితే ఏమౌతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
 

తులసి మొక్కను చాలా పవిత్రమైన మొక్కగా భావిస్తారు. దీనిలోని పవిత్ర, శుద్ధి చేసే లక్షణాల కారణంగా తులసి మొక్కను పూజిస్తారు. తులసి మొక్కను లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావిస్తారు. ఈ మొక్కను ఇంటి ఆవరణలో నాటితే ఇంటికి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అయితే తులసిని పూజించే సమయంలో కొన్ని ప్రత్యేకమైన నియమాలను పాటించాలని జ్యోతిష్యులు చెప్తారు. దీంతో మీ ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది. ఇందుకోసం తులసి మొక్కను నీళ్లను సమర్పించడం, దీపాలను వెలిగించడం చేయాలి.

అలాగే తులసి మొక్కకు కొన్ని సందర్భాల్లో, రోజుల్లో నీరు పోయకూడదని చెప్తారు. ఉదాహరణకు ఆదివారం తులసికి నీరు సమర్పించడం నిషిద్ధం. అయితే ఆదివారం నాడు తులసిమొక్క దగ్గర దీపం వెలిగించకూడదా? అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. దీనిపై జ్యోతిష్యులు, పండితులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

ఆదివారం తులసిపై దీపం వెలిగించవచ్చా?

జ్యోతిషశాస్త్రంలో తులసి మొక్కకు క్రమం తప్పకుండా నీరు పోసి పూజించాలని నమ్ముతారు. ఇలా చేస్తే ఇంటి సౌభాగ్యం కొనసాగుతుంది. అయితే కొన్ని గ్రంధాల్లో అయితే ఈ రోజు తులసికి నీరు సమర్పించడం నిషిద్దమని ఉంది. 
 

తులసి మాత ఆదివారం విష్ణువు కోసం ఉపవాసం ఉంటుందని నమ్ముతారు. అందుకే ఈ రోజున తులసి మాతకు నీటిని సమర్పించకూడదని నమ్ముతారు. ఈ రోజు నీటిని సమర్పిస్తే ఆమె ఉపవాసం విరమించబడుతుంది. అలాగే మీరు పూజ చేసిన ఫలితాన్ని కూడా పొందలేరు. అలాగే ఈ రోజున తులసిమొక్క దగ్గర దీపాలు వెలిగించడం కూడా నిషిద్ధమని, ఆదివారం తులసి ఆరాధన చేయకూడదని నమ్ముతారు. ఆదివారం తులసి మొక్కను ముట్టుకోకూడదని కూడా అంటారు.
 

తులసి దగ్గర దీపం ఎప్పుడు వెలిగించకూడదు?

తులసి మొక్క దగ్గర సాయంత్రం అంటే సూర్యాస్తమయం తర్వాత దీపాలు వెలిగించకూడదని నమ్ముతారు. తులసి మొక్క సూర్యాస్తమయం తరువాత నిద్రలోకి జారుకుంటుందని ఈ సమయంలో వారి ఆరాధన ఆమోదయోగ్యం కాదని నమ్ముతారు. ఈ సమయంలో తులసికి నీటిని కూడా సమర్పించకూడదు. ఆదివారాల్లో కూడా తులసి దగ్గర దీపాలు వెలిగించకూడదు. నిజానికి ఆదివారాన్ని సూర్యభగవానుని రోజుగా భావిస్తారు. తులసిని లక్ష్మీదేవి అవతారంగా భావిస్తారు.
 

జ్యోతిషశాస్త్రంలో.. సూర్యుడు, విష్ణువును కలిసి పూజించకూడదని చెప్తారు. అందుకే ఈ రోజున తులసిని పూజించడం లేదా తులసి దగ్గర దీపం వెలిగించడం నిషిద్ధం. అలా కాకుండా గ్రహణ సమయంలో తులసిలో దీపం వెలిగించకపోవడమే మంచిది.

click me!