ఈ రాశివారు తమ పొగరు వల్ల ప్రేమకు దూరమౌతారు..!

First Published | Mar 26, 2021, 12:32 PM IST

రాశుల ప్రకారం.. అసలు ఓ వ్యక్తికి ఏం నచ్చుతాయి.. ఏం నచ్చవు..? వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చట.

ప్రతి మనిషి జీవితంలో ప్రేమ, పెళ్లి కీలక పాత్ర పోషిస్తాయి. కొందరు తమ జీవిత భాగస్వాములతో చాలా ప్రేమగా ఉంటారు. కొందరు కోపంగా కూడా ఉంటారు. ఈ సంగతి పక్కన పెడితే.. మీరు కనుక జోతిష్య శాస్త్రాన్ని నమ్మితే.. వారి రాశుల ప్రకారం.. అసలు ఓ వ్యక్తికి ఏం నచ్చుతాయి.. ఏం నచ్చవు..? వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చట. మరి అదెలాగో మనమూ చూద్దామా..
1.మేష రాశి..ఈ రాశివారికి కోపం ఎక్కువ. చిన్న చిన్న విషయాల పట్ల ఎక్కువగా ఉత్సాహం చూపిస్తుంటారు. కాగా.. అతి ఉత్సాహం వల్లే జీవితంలో చాలా కోల్పోతుంటారు.

2.వృషభ రాశి..ఈ రాశివారు ప్రతి విషయంలో చాలా పాజిటివ్ గా ఉంటారు. తమకు నచ్చిన వారి పట్ల కొంచెం జెలస్ గా ఉంటారు. అంతేకాకుండా ఎక్కువగా అల్లరి పనులు చేస్తుంటారు.
3.మిథున రాశి..ఈ రాశివారు చాలా మూడిస్ట్. వాళ్ల మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో వారికే తెలీదు. దాని కారణంగానే.. వారితో రిలేషన్ చాలా కష్టంగా ఉంటుంది.
4. కర్కాటక రాశి..ఈ రాశివారు చాలా సెన్సిటివ్ గా ఉంటారు. దాని వల్ల చాలా విషయాలను కోల్పోతారు.
5. సింహ రాశి..జీవితంలో ఏదైనా సాధించగల సత్తా వీరికి ఉంది. అయితే.. అదే కొన్ని సార్లు వీరికి మైనస్ గా మారుతుంది. ఏదైనా సాధించగలమనే గర్వం వీరికి ప్రేమను దూరం చేస్తుంది.
6. కన్య రాశి..ఈ రాశివారు తరచూ గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. ప్రేమిస్తే విపరీతంగా ప్రేమిస్తారు. అదే ఒక్కసారి ద్వేషిస్తే.. అంతే ద్వేషాన్ని పెంచుకుంటారు.
7. తుల రాశి..ఈ రాశివారు తమ నిర్ణయాలను వెంట వెంటనే మార్చేస్తూ ఉంటారు. తమ సొంతంగా ఏ నిర్ణయం తీసుకోలేరు.
8. వృశ్చిక రాశి..వీరు తమ శత్రువులపై ఎప్పుడూ పగ తీర్చుకోవాలని చూస్తుంటారు. వీరితో రిలేషన్ కొంచెం కష్టంగా ఉంటుంది.
9. ధనస్సు రాశి..వీరికి నోటి దురద కాస్త ఎక్కువ. చెత్త పదాలు ఎక్కువగా వాడుతూ ఉంటారు. దాని వల్ల తర్వాత ఏం జరుగుతుందనే విషయం గురించి ఆలోచించరు.
10. మకర రాశి..ఈ రాశివారు తమ వారి కోసం పెద్దగా ఆలోచించరు. వారి సొంత నియమాలను పాటిస్తూ ఉంటా
11.కుంభ రాశి..ఈ రాశివారు తొందరగా ఎవరితోనూ కలవరు. దూరంగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు.
12.మీన రాశి..ఈ రాశి వారు తమ సొంత ప్రపంచంలో జీవిస్తూ ఉంటారు. దాని వల్ల ప్రేమకు దూరమౌతారు.

Latest Videos

click me!