ఇదో కన్ఫ్యూజ్డ్ లవ్ స్టోరీ... భర్త మోసం చేశాడని..

First Published | Mar 25, 2021, 2:54 PM IST

ఈ విషయం ఆమెకు భర్తకు తెలియజేయడం వల్ల.. తన భర్తను తాను తిరిగి దక్కించుకోవచ్చని ఆమె ఆశపడింది. అయితే.. ఆమె జీవితంలో అనుకోని మలుపు అక్కడే తిరిగింది.

లైఫ్ అంటేనే ఎన్నో ఊహించని మలుపులు తిరుగుతూ ఉంటుంది. మనం ఊహించనిది జరగడాన్నే జీవితం అంటారు. కొందరికి సరైన వయసులోనే నిజమైన ప్రేమ లభిస్తుంది. కానీ.. కొందరికి మాత్రం పెళ్లైన తర్వాత కూడా అనూహ్యంగా ప్రేమ దొరికే అవకాశం కూడా లేకపోలేదు. ఓ మహిళ విషయంలో అదే జరిగింది. ఆమెకు పెళ్లైన తర్వాత మరో వ్యక్తిపై ప్రేమ పుట్టింది. ఈ నేథప్యంలో.. తనకు ఎదురైన విషయాలను సదరు మహిళ ఏం చెబుతుందో ఇప్పుడు విందాం.
ఆమెకు పెళ్లైంది. భర్త కూడా ఉన్నాడు. అయితే.. తనకు తెలీకుండా ఆమె భర్త మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆమెను భర్త అతి దారుణంగా మోసం చేశాడు. ఈ క్రమంలో.. తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళకు కూడా పెళ్లైందన్న విషయం ఈమెకు తెలిసింది.

ఈ విషయం ఆమెకు భర్తకు తెలియజేయడం వల్ల.. తన భర్తను తాను తిరిగి దక్కించుకోవచ్చని ఆమె ఆశపడింది. అయితే.. ఆమె జీవితంలో అనుకోని మలుపు అక్కడే తిరిగింది. తన భర్త ప్రియురాలి భర్తతో ఆమెకు ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది.
తొలుత ఆమె తన భర్తతో చాలా ప్రేమగానే ఉండేది. కానీ.. భర్త తరచూ వర్క్ ఉంటందంటూ దూరం పెట్టేవాడు. అర్థరాత్రి వరకు సీక్రెట్ గా ఫోన్లు మాట్లాడటం లాంటివి చేసేవాడు. కనీసం ఆమెతో సెక్స్ చేయడం కూడా ఆపేశాడు. దీంతో.. ఆమెలో అనుమానం మొదలైంది. తన భర్త ఎఫైర్ పెట్టుకున్న మహిళ తనకన్నా అందంగా ఉంటుందా అనే విషయం తెలుసుకోవాలని అనిపించింది.
అందుకే.. ఎవరికీ తెలీకుండా సీక్రెట్ గా భర్తను ఫాలో చేయడం మొదలుపెట్టింది. మరో మహిళతో ప్రేమగా చనువుగా తిరగడం ఆమె కళ్లారా చూసింది. వారిద్దరూ సిటీకి దూరంగా వెళ్లి మరీ కామక్రీడల్లో ఎంజాయ్ చేస్తున్నారని అర్థమైంది.
ఈ నేపథ్యంలో తన భర్తతో ఎఫైర్ పెట్టుకన్న మహిళ చేతికి ఉన్న ఎంగేజ్మెంట్ రింగ్ కనపడింది. తన భర్త ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడా అని తొలుత అనుమానం కలిగింది. ఈ విషయం తెలుసుకునే ఈ క్రమంలోనే.. తన భర్త ఎఫైర్ పెట్టుకున్న మహిళకు ముందుగానే పెళ్లైందని తెలిసింది.
ఆమె పేరు తెలుసుకొని.. సోషల్ మీడియాలో వెతకగా.. ఆమె భర్త వివరాలు కూడా తెలిశాయి. వెంటనే ఆమె భర్తను కలిసి ఈ విషయాలన్నీ చెప్పాలని అనుకుంది. అతనికి సోషల్ మీడియాలో మెసేజ్ పెట్టింది. అనుకున్నట్లుగానే వారిద్దరూ ఓ రెస్టారెంట్ లో కలిశారు.
అతను చాలా అందంగా ఉన్నాడు. చాలా బాగా మాట్లాడాడు. దీంతో.. ఈమెకు మంచి పాజిటివ్ వైబ్స్ కలిగాయి. ఆ తర్వాత అతని భార్య.. తన భర్తతో కలిసి ఉన్నప్పుడు తాను తీసిన ఫోటోలను అతనికి చూపించింది.
దీని గురించి మాట్లాడుకోవడానికి వీరు మరోసారి కలుసుకోవాల్సి వచ్చింది. ఇలా వారి గురించి మాట్లాడుకోవడానికి వచ్చి.. వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. తమ పార్ట్ నర్స్ తమకు చేస్తున్న మోసం గురించి ఇద్దరూ తరచూ ఫోన్లో మాట్లాడుకునే వారు. ఈ క్రమంలో.. వీరిద్దరి అభిప్రాయాలు ఏకమయ్యాయి.
దీంతో.. వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. అయితే.. ఇది సరైన నిర్ణయమో కాదో అనే సందిగ్ధంలో ఆమె ఉండిపోయింది.

Latest Videos

click me!