ఒక్కో మనిషి మనస్తత్వం ఒక్కోలా ఉంటుంది. ఒకరి ఆలోచనా విధానం.. మరొకరితో మ్యాచ్ అవ్వకపోవచ్చు. కొందరి ఆలోచనలు మాత్రం ఒకేలా ఉంటాయి. ఏది ఎలా ఉన్నా.. ఒక రాశికి చెందిన వారిలో కొంత మేర అభిప్రాయాలు, ఆలోచనలు, ప్రవర్తన కలుస్తాయని జోతిష్య శాస్త్రం చెబుతోంది. కాగా... దాని ప్రకారం.. ఒక కన్య రాశివారితో ప్రేమలో పడితే ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం..
మీరు కనుక కన్య రాశికి చెందిన వారిని ప్రేమించినట్లయితే.. వారితో డేటింగ్ చేస్తున్నారనే అనుకుందాం. అయితే.. అసలు ప్రేమలో ఉన్నప్పుడు కన్య రాశివారు ఎలా ప్రవర్తిస్తారో ఇప్పుడు చూద్దాం.
ఈ రాశివారు అమితంగా ప్రేమిస్తారు. అసలు ప్రేమించడంలో చాలా పర్ఫెక్ట్ గా ఉంటారు. చూడటానికి చాలా సింపుల్ గా కనిపిస్తారు. కానీ చా తెలివిగా ఆలోచిస్తారు. వీరిలో రొమాంటిక్ యాంగిల్ కూడా కాస్త ఎక్కువనే చెప్పాలి.
వీరు ఒక్కసారి ప్రేమిస్తే... ప్రాణాలైనా ఇస్తారు. వారితో ఉండేవారే తమ ప్రపంచంగా జీవిస్తారు. ఎదుటివారు కూడా వారి ప్రేమ నుంచి దూరంగా వెళ్లాలని అనుకోలేరు. అయితే... వీరిని ప్రేమలో పడేలా చేయడం మాత్రం చాలా కష్టమట. కానీ ఒక్కసారి ప్రేమించారా.. ఇక వారిని జీవితంలో ఎప్పుడు వదులుకోలేరు.
ఈ రాశివారు ఎవరినిపడితే వారిని ప్రేమించలేరట. తమ కంఫర్ట్ జోన్ చూసుకొని మరీ ఎంచుకుంటారట. ఎందుకంటే.. వీరు ప్రతి విషయంలోనూ చాలా ఆర్గనైజ్డ్ గా ఉంటారు. కాబట్టి.. ఎవరినీ తొందరగా ఇష్టపడలేరు.
ఈ రాశివారు షార్ట్ టైమ్ ప్రేమను ఎక్కువగా కోరుకోరు. జీవితాంతం ఆనందంగా ఉంటూ.. తమ కోరికలను తీర్చుకుంటూ..జీవితాంతం ఉండే ప్రేమను కోరుకుంటారు.
వీరు ప్రతి విషయం చాలా తెలివిగా ఆలోచిస్తారు. వారు ఎంచుకునే పార్ట్ నర్ కూడా అంతే తెలివిగా ఉండాలని భావిస్తుంటారు.
తమతో జీవితాంతం ఉండే వ్యక్తి సహజంగా ఉండాలని కోరుకుంటారు. సినిమాల్లో లాగా.. డ్రమటిక్ గా ఉండాలని అనుకోరు. ఎక్కువగా నటిస్తూ ఉండేవారిని వీరు దూరంగా ఉంచుతారు.
ఎలాంటి పరిస్థితిని అయినా హ్యాండిల్ చేయగలిగే సత్తా మీలో ఉంటే.. మీ లాంటివారికి కన్య రాశివారు చాలా ఈజీగా పడిపోతారు.
ప్రతి విషయంలో ఎత్తి చూపిస్తూ.. క్రిటిసైజ్ చేసేవారంటే ఈ రాశివారికి అస్సలు నచ్చదు. తమలోని తప్పులను కూడా అంగీకరిస్తూ.. ప్రేమగా ఉండేవారిని మాత్రమే వీరు కోరుకుంటారు.
ఈ రాశివారు తమ పార్ట్ నర్ కి ఎల్లప్పుడూ సహాయం చేస్తూ..ప్రతి విషయంలో తోడుగా ఉంటారు.