సమ్మోహనం... ఇదీ ఒక కళే...మీ కిష్టమైన పురుషుడిని ఆకర్షించగలగడం, మీ కోసం పడిపోయేలా చేయడం మామూలు విషయం కాదు. దీనికి మీరు కనిపించే విధానం, మీ చూపుల మాత్రమే సరిపోవు. పెదాలు అందంగా కనిపిస్తే చాలదు.. ఆ పెదాలతో అద్భుతంగా మాట్లాడగలగాలి. అప్పుడే వాటి అందం ద్విగుణీకృతం అవుతుంది. అలాగే ఎదుటివారిని సమ్మోహన పరిచి మీ మాయాజాలంలో పడేయాలంటే డ్రెస్సింగ్ ఒక్కటే సరిపోదు. మరెలా అంటారా?
మీ మీద మనసుపడాలన్నా మీ మాయలో మునిగితేలాలన్నా.. ముందుగా మిమ్మల్ని మీరు ఆరాదించుకోవాలి. మీ మీద మీరు సమ్మోహితులు కావాలి. ఖరీధైన దుస్తులు, నగలు, మేకప్ ఇవన్నీ తాత్కాలికంగా మిమ్మల్ని అందంగా కనిపించేలా చేయచ్చు. కానీ అది ఇక్కడ పనికి రాదు. శాశ్వతమైన మానసిక అందం మీద దృష్టి పెట్టండి.
మీలో మీకు బాగా నచ్చే అంశాలేంటి? ఉత్సుకత ఎక్కువా, బాగా మాట్లాడగలుగుతారా.. ఎక్స్ ట్రావర్టా, కేరింగ్ గా ఉంటారా, ఉదార స్వభావులా? మీకు తెలిసి ఉండాలి. మీలో మీరు ఏ స్వభావాన్ని మార్చుకోవాలనుకుంటున్నారు? ఇదే మీ మీద మీరు మోహపడడం.. అంటే మిమ్మల్ని మీరు పూర్తి తెలుసుకోవడం అన్నమాట.
మీరు ఒక వ్యక్తిని మోహిస్తున్నారంటే.. మీరెవరో, మీరు దానినుండి ఏం కోరుకుంటున్నారు, ఏమి ఇవ్వదలిచారు మీకు తెలిసి ఉండాలి. ఆత్మవిశ్వాసం అనేది మార్కెట్లో దొరికే వస్తువు కాదు. అది తన గురించి తనకు తెలిసిన వ్యక్తిలో వచ్చే ఓ అద్భుతమైన స్వభావం.
అందుకే తాత్కాలికమైన విషయాలతో కాకుండా మీలోని లోపాలతో ప్రేమలో పడండి. అది మీలోని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. మీరు ఎలా ఉన్నారో అలాగే ప్రపంచానికి చూపించడానికి వెనకాడకండి. మీలోని లోపాలతో పాటు మిమ్మల్ని మీరు గర్వంగా ప్రదర్శించుకోండి. ఈ బోల్డ్ నెస్ మీరు ఇష్టపడే వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడేలా చేస్తుంది.
స్త్రీలలో పురుషులు మొదటగా కనిపెట్టేది వారి కదలికల్ని. తమ గురించి తాము కాకుండా ఎదుటివారు తమ గురించి ఏమనుకుంటున్నారు అనేదే స్త్రీలు ఎక్కువగా ఆలోచిస్తారు. దాని ప్రకారమే తమ కదలికలు ఉంటాయి. అయితే మీ వ్యక్తిత్వం ఏంటి అనేది మిమ్మల్ని డిసైడ్ చేస్తుంది.
మీరేం వేసుకున్నారనేదాని కన్నా మీ వైబ్ నే పురుషులు ఎక్కువగా గమనిస్తారు. మీకు సౌకర్యంగా ఉండే దుస్తులను మీరు వేసుకుంటే అది మీ ప్రవర్తనలో కనిపిస్తుంది. లేకపోతే అది మీలోని నిరాశ, నిస్పృహల్ని పట్టిస్తుంది.
అలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని చూసి ఎవరైన ఎలా ఆకర్షితులవుతారు. ఎలా మీతో మాటలు కలపాలని ప్రయత్నిస్తారు. ఓ చక్కటి సహజమైన, స్వచ్ఛమైన నవ్వు ఎలాంటి మగాడినైనా ఇట్టే ఆకర్షిస్తుంది.
అందమైన ఆ చిలిపినవ్వు మీరు మరీ సీరియస్ వ్యక్తి ఏమీ కాదని, మీలోనూ చిలిపితనం, సరదా ఉందని ఎదుటి వ్యక్తికి చెబుతుంది. అంతేకాదు మీరిష్టపడే వ్యక్తిని చూసి చిరునవ్వు నవ్వేముందు అతని కళ్లలోకి కొన్ని సెకండ్ల పాటు సూటిగా చూడండి. ఇది వారిని మీ వైపు ఆకర్షించేలా చేస్తుంది.
ఎదుటి వ్యక్తిని ఆకర్షించాలంటే మాటలు, బాడీ లాంగ్వేజ్ చాలా ముఖ్యం. అందుకే మీరేం వేసుకున్నారు అనే దానికంటే మీరెలా మాట్లాడతారు అనేదే ముఖ్యం. సంభాషణ ఎప్పుడు, ఎలా మలుపుతిరుగుతుందో.. ఎలా సాగుతుందో చెప్పడం కష్టం. కానీ సరైన సమయంలో సరైన మాట వాడడం అనేది చాలా ముఖ్యం.
ఎదుటి వ్యక్తి ఏదైనా ప్రశ్న మిమ్మల్ని అడగగానే వెంటనే నోటికొచ్చిందేదో చెప్పేయకండి. కాసేపు ఆగండి.. ఆలోచించండి.. దాన్ని అందంగా ఫ్లర్టింగ్ వే లో ఎలా చెప్పొచ్చో.. మెల్లగా సస్పెన్స్ తో రివీల్ చేయండి.
మోహంలో పడేయడం అంటే రహస్యాన్ని మెయింటేన్ చేయడమే. పదాలతో ఆడుకోవడమే, క్రియోటివ్ గా ఉంటూ మెల్లమెల్లగా వారికి కావాల్సింది.. ఊరించి ఊరించి ఇవ్వడమే.
అంతేకాదు బాడీ లాంగ్వేజ్ తో మీరు సెడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసేలా చేయాలి. దాన్ని సరైన పదాలతో, సరైన సమయంలో చెప్పగలగడం ముఖ్యం. చిన్నగా తాకడం, కళ్లలోకి సూటిగా చూడండి, మీ జుట్టుతో ఆడుకోవడం, స్పాంటేనియస్ గా ఉండడం ఇవన్నీ అతన్ని మీ మాయలో పడేస్తారు.
చేతులు కట్టుకోవడం అనేది పూర్తిగా మరిచిపోండి. అది ఆ వ్యక్తి రిజర్వ్ డ్ గా ఉన్నాడనే సంకేతాన్ని ఇస్తుంది. సెన్స్ ఆఫ్ హ్యూమర్, తెలివి, స్పాంటేనిటీ, బాడీ లాంగ్వేజ్ ఇవే మిమ్మల్ని ఆకర్షించేలా చేస్తాయి.
ఇవే ఎలాంటి ఎక్స్ పోజింగ్ లేకుండా పురుషుడు మీ మాయలో పడేలా చేస్తాయి. నిజమే పురుషులు శారీరక ఆకర్షణకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. కానీ మీ వ్యక్తిత్వం వారిని మీ హృదయాన్ని కొల్లగొట్టాలనే ఆలోచన వచ్చేలా చేస్తుంది. మీ చుట్టు గింగిరాలు తిప్పిస్తుంది.