Relationship: మీ పార్ట్నర్ మాటల్లో నిజం ఎంతో తేల్చుకోలేకపోతున్నారా.. అయితే ఈ చిట్కాలు మీకోసమే?

First Published | Jul 11, 2023, 2:28 PM IST

Relationship: గత రోజుల్లో బంధంలో ఒక నిజాయితీ ఉండేది.  ఇలాంటి నిజాయితీ మీ జీవిత భాగస్వామి లో ఉందో లేదో తెలుసుకోవటం కష్టమైపోతుందా.. అయితే ఈ చిట్కాలు పాటించి నిజం తెలుసుకోండి.
 

ఒక బంధం నిలబడాలంటే నిజాయితీ చాలా అవసరం. కొందరు తమ జీవిత భాగస్వామి వద్ద కొన్ని విషయాలు దాచిపెడుతూ ఉంటారు బయట చేసేది ఒకటి ఇంట్లో చెప్పేది ఒకటి. చిన్న చిన్న విషయాల్లో అబద్ధం చెప్తే పర్వాలేదు కానీ అదే అబద్ధం ఆ బంధానికి బీటలు వారే ప్రమాదం ఉంది.
 

ఇది అలవాటు మళ్లీమళ్లీ రిపీట్ అయితే కనుక విభాగస్వామిని అనుమానించి తీరాల్సిందే. మీ భాగస్వామి చెప్తున్నది నిజమా అబద్దమో తెలుసుకోవడం కోసం ఈ చిట్కాలు పాటించండి.
 

Latest Videos


కొన్నిసార్లు ఇంటికి లేటుగా వచ్చిన పార్ట్నర్ ని ఎందుకు లేట్ అయింది అని అడిగితే పొంతనలేని సమాధానాలు చెప్తారు. మరో గంట పోయిన తర్వాత అడిగితే మరొక రకం సమాధానం చెప్తారు. వాళ్ళు చెప్పింది నిజమైతే రెండు సమాధానాలు ఒకటే అవుతాయి.
 

కానీ రెండు వేరు వేరు సమాధానాలు వస్తే మాత్రం వాళ్లు అబద్ధం చెప్తున్నట్టు లెక్క. ఇద్దరూ కలిసి చర్చించుకోవాల్సిన సమస్యలను అవతలి వ్యక్తితో ఏమీ షేర్ చేసుకోకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు అంటే వాళ్ళు మీ దగ్గర ఏదో దాస్తున్నారని అర్థం అలాంటి వాళ్ళని ఒక కంట కనిపెట్టండి.

ఇంకా చాలామంది తమని తాము రక్షించుకోవడం కోసం నిందని ఎదుటి వాళ్ళ మీదికి తోసేస్తారు. మనం వాళ్ళని ప్రశ్నించేలోపు వాళ్లే మనల్ని ఎదురు ప్రశ్నా వేస్తారు ఇలాంటి వాళ్ళని కూడా అనుమానించి తీరాల్సిందే. ఇక మరొక రకం మనుషులు అడిగిన చిన్న ప్రశ్నకి ఆరు కాగితాల సమాధానం చెప్తారు. అయితే ఇందులో ఏమాత్రం క్లారిటీ ఉండకపోవటం విశేషం.
 

ఇలాంటి వాళ్ళని కూడా జాగ్రత్తగా గమనించాలి. మరొక రకం మనుషులు మనం అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పకుండా టాపిక్ డైవర్ట్ చేసేస్తూ ఉంటారు. కాబట్టి వ్యవహారాన్ని జాగ్రత్తగా డీల్ చేయండి. బంధం ప్రమాదంలో పడక ముందే కాపాడుకోండి.

click me!