కలర్ సైకాలజీ.. ఈ రంగుని ఇష్టపడేవారు చాలా రొమాంటిక్..!

First Published | Jul 7, 2021, 12:01 PM IST

మీకు నచ్చిన రంగును బట్టి.. మీరేంటో చెప్పేయవచ్చట. మీ మనస్తత్వం ఏంటి..? మీరు ఎలా ప్రవర్తిస్తారు.. ఇలా అన్నీ.. కేవలం మీ ఫేవర్ కలర్ ని బట్టి చెప్పేయవచ్చట. మరి అదేంటో మనమూ తెలుసుకుందామా..?

మనది రంగు రంగుల ప్రపంచం. మన చుట్టూ ఎన్నో అద్భుతమైన రంగులు ఉన్నాయి. ఈ రంగుల్లో ఒక్కొక్కరికి ఒక్కో రంగు నచ్చుతుంది. ఆ నచ్చిన రంగు ఉన్న వస్తువులను వారు ఎక్కువగా సెలక్ట్ చేసుకుంటూ ఉంటారు. అయితే.. కలర్ సైకాలజీ ప్రకారం.. మీకు నచ్చిన రంగును బట్టి.. మీరేంటో చెప్పేయవచ్చట. మీ మనస్తత్వం ఏంటి..? మీరు ఎలా ప్రవర్తిస్తారు.. ఇలా అన్నీ.. కేవలం మీ ఫేవర్ కలర్ ని బట్టి చెప్పేయవచ్చట. మరి అదేంటో మనమూ తెలుసుకుందామా..?
నలుపు..చాలా మంది నలుపుని చీకటితో.. లేదా చెడుతో పోలుస్తుంటారు. అందులో ఎలాంటి నిజం లేదు. అది కేవలం వారి నమ్మకం మాత్రమే. అయితే.. ఇదే నలుపు రంగుని అమితంగా ఇష్టపడేవారు చాలా మంది ఉన్నారు. వారు.. ఎక్కువ సందర్భాల్లో నలుపు ధరించడం.. లేదా దాని కాంబినేషన్ డ్రెస్ వేసుకోవడం.. ప్రతి వస్తువులోనూ ఆ రంగు క్యారీ చేస్తుంటారు. అయితే.. కలర్ సైకాలజీ ప్రకారం.. ఈ రంగుని ఇష్టపడేవారు.. ఎక్కువ గా నిరాశలో ఉంటారట. అయితే.. ఇది కొద్ది మందికి మాత్రమే అలా అవుతుందట. కొందరికి మాత్రమే.. ఇదే నలుపు రంగు బలాన్ని అందిస్తుంది. ఆ రంగు వారికి అందాన్ని ఇస్తుంది. లైంగిక ఆసక్తి వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఈ రంగు మనిషి స్వతంత్ర స్వభావాన్ని తెలియజేయడానికి వినియోగిస్తారు.

తెలుపు..తెలుపు రంగు దైవానికీ, పుట్టుక, అమాయకత్వానికి ప్రతీక. ఈ రంగుని ఇష్టపడేవారు దాదాపు సున్నితంతగా ఉంటారు. అయితే.. ప్రతి విషయంలోనూ చాలా తెలివిగా ఆలోచిస్తారు. చాలా క్రమ శిక్షణను కలిగి ఉంటారు.
ఎరుపు..ఈ రంగుని ఇష్టపడేవారు చాలా మందే ఉంటారు. ఈ రంగును చాలా మంది హింసకు సంకేతంగా భావిస్తూ ఉంటారు. అంతేకాదు.. ఈ రంగు కోరిక, ప్రేమను తెలియజేస్తుంది. మీకు ఇష్టమైన రంగు ఎరుపు అయితే... మీరు ఎక్కువగా ప్రేమలో ఉన్నట్లు అర్థమట. చాలా సాహోసేపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. చాలా చురుకుగా ఉంటారు. ఇది కోపానికి కూడా సంకేతం.
పర్పుల్..చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. పూర్వ కాలం రాజులు మాత్రమే ఈ రంగును వాడేవారట. ఈ రంగు రాజరికానికి చిహ్నం. అందరిలోకి తాము స్పెషల్ గా ఉండాలని కోరుకునేవారు ఈ రంగుని ఎక్కువ ఇష్టపడతారట.
పింక్..ఈ రంగు పేరు వినపడగానే.. చాలా మంది అమ్మాయిల రంగు అని అనుకుంటూ ఉంటారు. కానీ అందులో ఎలాంటి నిజం లేదు. ఈ రంగు ఎవరైనా ఇష్టపడొచ్చు. ఈ రంగు ఆరోగ్యానికి గుర్తు. ఈ రంగుని ఇష్టపడేవారు.. చాలా రొమాంటిక్ గా ఉంటారు.
ఆరెంజ్..ఈ రంగుని ఇష్టపడేవారు చాలా డైనమిక్ గా ఉంటారు. అంతేకాదు.. ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. అంేతకాకుండా నిజాయితీగా కూడా ఉంటారు.
బ్లూ..(నీలం)ప్రశాంతతకు ఈ రంగు చిహ్నం. ఈ రంగుని ఇష్టపడేవారు కూడా అంతే ప్రశాంతంగా ఉంటారు.
గ్రీన్( ఆకుపచ్చ)ఈ రంకు ప్రకృతికి చిహ్నం. ఈ రంగుని ఇష్టపడేవారిలో అసూయ, దురాశ లాంటివి ఉండదు. అందరితో అంకిత భావంతో మెలుగుతారు.
పసుపు..విష్ణుమూర్తి దుస్తులు ఎల్లప్పుడూ పసుపు రంగులో ఉంటాయి, ఎందుకంటే ఇది జ్ఞానాన్ని సూచిస్తుంది. అందుకే హిందువులు శుభాకార్యాలలో పసుపు రంగు ధరించాలని ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ఈ రంగు ఆనందానికి చిహ్నం. ఈ రంగుని ఇష్టపడేవారు చాలా చురుకుగా ఉంటారు.
బ్రౌన్...మట్టి, సేంద్రియ రంగుని ఈ బ్రౌన్ సూచిస్తుంది. ప్రకృతికి మరో రూపంగా దీనిని చెప్పొచ్చు. ఈ రంగు ని ఇష్టపడేవారు జీవితంలో చాలా స్థిరంగా ఉంటారు.

Latest Videos

click me!